E-Paper
Advertisement

Ambati Rayudu: రాసిపెట్టుకోండి..20-25 బంతుల్లోనే వైభ‌వ్ సెంచ‌రీ చేస్తాడు

Ambati Rayudu: రాసిపెట్టుకోండి..20-25 బంతుల్లోనే వైభ‌వ్ సెంచ‌రీ చేస్తాడు
Advertisement

Ambati Rayudu:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( vaibhav suryavanshi) అరాచకం సృష్టిస్తున్నాడు. వరల్డ్ క్లాసు బౌలర్లను కూడా రఫ్ ఆడిస్తున్నాడు. నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Sunrisers Hyderabad vs Rajasthan Royals ) మధ్య మ్యాచ్ జరిగిన నేపథ్యంలో 97 పరుగులు చేసి, అందరి దృష్టిని ఆకర్షించాడు వైభవ్. అయితే అలాంటి వైభవ సూర్యవంశీ పై నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మాజీ క్రికెటర్లు కూడా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ను మెచ్చుకుంటున్నారు.

Also Read: Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో 

రాసిపెట్టుకోండి..20-25 బంతుల్లోనే వైభ‌వ్ సెంచ‌రీ చేస్తాడు

Advertisement

వైభవ్ సూర్య వంశీ ఆట తీరుపై లేటెస్ట్ గా అంబటి రాయుడు (Ambati Rayudu) కూడా రియాక్ట్ అయి, షాకింగ్ కామెంట్స్ చేశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడం గ్యారంటీ అన్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. 20 నుంచి 25 బంతుల్లో వైభవ్ సూర్య వంశీ సెంచరీ చేయడం గ్యారంటీ అని తెలిపారు. అతి త్వరలోనే ఇది జరగబోతుందని వ్యాఖ్యానించారు. ఇది ఒక్కటే కాదు, టి20 క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన మొనగాడిగా వైభవ్ సూర్యవంశం నిలుస్తాడని ప్రకటించారు. ఈ దెబ్బకు క్రిస్ గేల్ సాధించిన 175 పరుగుల రికార్డును కూడా 15 ఏళ్ల వైభవ్ బ్రేక్ చేయడం గ్యారంటీ అని శపథం చేశారు. ఇది జరగకపోతే తాను కామెంట్రీ కూడా చేయబోనని సవాల్ విసిరారు. అదే సమయంలో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ వేలంలోకి వస్తే ఎలా పరిస్థితి ఉంటుందనే దానిపైన కూడా అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ వైభవ్ సూర్య వంశీ వేలంలోకి వస్తే రికార్డ్ ధర పలుకుతాడని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రేటు అతనిదే అవుతుందని వెల్లడించారు.

రాజస్థాన్ రాయల్స్ నుంచి యశస్వి జైస్వాల్ తప్పుకోవాల్సిందే

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టును యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal ) వీడాల్సి వస్తుందని హెచ్చరించారు అంబటి రాయుడు. వైభవ్ సూర్యవంశీ కారణంగా యశస్వి జైస్వాల్ కు సరిగ్గా బ్యాటింగ్ రావడం లేదని కూడా వ్యాఖ్యానించారు. వైభవ్ భయంకరమైన హిట్టింగ్ కారణంగా, యశస్వి జైస్వాల్ పేరు మరుగున పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి క్రమంలో వెంటనే ఆ జట్టును వీడి, మరో టీం లోకి వెళ్లాలని సూచనలు చేశారు. అప్పుడే యశస్వి జైస్వాల్ కు న్యాయం జరుగుతుందన్నారు. ఛాన్స్ ఉంటే ముంబై ఇండియన్స్ లోకి వస్తే బెటర్ అన్నారు. రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉంది కాబట్టి, అక్కడ య‌శ‌స్వి జైస్వాల్ కు ఛాన్స్ ఉంటుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read:  Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×