E-Paper
Advertisement

Cabbage Benefits: క్యాబేజీ తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

Cabbage Benefits: క్యాబేజీ తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..
Advertisement

Cabbage Benefits: క్యాబేజీని ఆహారంలో భాగంగా ఓ కూరగాయలా మాత్రమే చూస్తారు. కానీ క్యాబేజీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీని తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే క్యాబేజీలో ఎక్కువ శాతం నీరు ఉండడం కారణంగా ఇది శరీరానికి మేలు చేస్తుంది.

క్యాబేజీలో విటిమిన్లు, పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సీ, కే జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతేకాదు క్యాన్సర్, గుండె సంబంధింత ప్రాణాంతకర ప్రమాదాల నుంచి కూడా రక్షిస్తుంది. దీనిని కూరలు వండుకోవడమే కాదు, సలాడ్స్, సూప్స్ ఇలా ఏదో ఒక రకంగా తరచూ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని జీర్ణసమస్యలు, మలబద్ధకం, అజీర్తి, అసిడిటీ వంటి అనేక సమస్యలను తొలగిస్తుంది.

Advertisement

అంతేకాదు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలోను ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులు తమ తరచూ ఆహారపు అలవాట్లలో క్యాబేజీని చేర్చుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. క్యాబేజీలో ఉండే సల్ఫర్, గ్లూకోసైనోలేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ వంటి చాలా రకాల సమస్యలను నివారిస్తుంది. ఇది ఏ సీజన్లో అయినా సులువుగా లభిస్తుంది. అందువల్ల దీనిని తరచూ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడేవారికి ఇది చక్కగా పనిచేస్తుంది.

Related News

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

మీ దాంపత్య జీవితంలో గొడవలు ఎప్పుడూ ఉండవు.. ప్రేమ మరింత పెరుగుతుంది.. ఈ టిప్స్ పాటిస్తే

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

Big Stories

Advertisement
×