E-Paper
Advertisement

దుల్కర్ సినిమాలో రుహాని శర్మ.. బిజిలిగా కొత్త అవతారం!

దుల్కర్ సినిమాలో రుహాని శర్మ.. బిజిలిగా కొత్త అవతారం!
Advertisement

Aakasamlo Oka Tara:మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ అనే మరో సరి కొత్త సినిమాతో పలకరించడానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలోనూ అటు , ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా తాజాగా రిలీజైన ‘చిట్టి చీమ’ పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది కూడా. మహానటి, సీతారామం లాంటి లవ్‌ అండ్ ఎమోషనల్ స్టోరీస్ తో ఆకట్టుకున్న దుల్కర్ ఈసారి ఒక డిఫరెంట్ లవ్ అండ్ ఎమోషనల్ ఫిలిం తో పలకరించబోతున్నాడు.

Advertisement

ఇక ఈ సినిమాలో ఆయనకి జోడీగా సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా కనిపించనుండటం విశేషం. ఇలా ముగ్గురు క్రేజీ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో నటిస్తుండటంతో సినిమా మీద క్యూరియాసిటీ పెరిగిపోయిందని చెప్పాలి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల చేసిన రుహాని శర్మ ఫస్ట్ లుక్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె ‘బిజిలి’ అనే వెరైటీ పేరుతో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఆమె లుక్ చూస్తుంటేనే సినిమాలో రహానే సంథింగ్ మ్యాజిక్ చేసేలానే కనిపిస్తుంది.

Advertisement

అయితే, అసలు ఈ బిజిలి పాత్ర కథలో ఎలాంటి మలుపులు తిప్పుతుంది? దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్‌తో ఈమెకు ఎలాంటి లింక్ ఉంటుంది? అనే దానిపై మాత్రం మేకర్స్ ఇప్పుడే ఎలాంటి హింట్స్ ఇవ్వకపోవడం గమనార్హం.

ఇక చిలసౌ, హిట్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుహాని శర్మ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్‌ను ఎంచుకోవడం మెచ్చుకోతగ్గ విషయం.

ఇక . ఇప్పుడు ఈ సినిమాలో ఆమె చేస్తున్న బిజిలి పాత్ర కూడా ఆమె కెరీర్‌లో మరో బెస్ట్ రోల్‌గా నిలుస్తుందని అంటున్నారు మూవీ లవర్స్. ఇక ఈ సినిమాకు ‘ప్రేమ ఇష్క్ కాదల్’,‘సేనాపతి’ లాంటి డిఫరెంట్ మూవీస్‌తో టాలెంట్‌ నిరూపించుకున్న పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెల్సిందే.

గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల కలలు, జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లను చాలా సహజంగా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే స్పష్టమవుతోంది. కంటెంట్ మీద గట్టి నమ్మకంతోనే డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ క్రేజీ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా . ఇప్పటికే వచ్చిన పాటలు సినిమాపై అంచనాలను డబుల్ చేశాయనే చెప్పాలి. టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా రిచ్‌గా ఉన్నట్లు టీజర్‌ ద్వారా తెలుస్తోంది. ఇక ప్రామిసింగ్ మేకర్స్ గా పేరు తెచ్చుకున్న గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండటం ఇక్కడ మరో విశేషం.

ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీని నవంబర్ 20న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.చూడాలి మరి బిజిలిగా వస్తున్న రుహాని శర్మ ఏం మాయ చేస్తుందో !

also read:మోహన్ బాబు కంటే రెండు ఆకులు ఎక్కువే చదివా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

Tags

Related News

స్క్రిప్ట్‌లో లేని కామెడీ.. ఆలీ, బాబూమోహన్ కలిసి చేసిన అల్లరి ఇదే!

సాయంత్రం మాట్లాడుకున్నాం.. తెల్లవారుజామున ఆ వార్త .. కోట గురించి బాబూమోహన్ ఎమోషనల్!

గ్లామర్ డోస్ పెంచిన నభా నటేష్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్.. మళ్లీ వాయిదా పడిన ఇట్లు అర్జున..!

రాజశేఖర్‌తో బాబూమోహన్ స్నేహం వెనుక ఇంత కథ ఉందా?

మోహన్ బాబు కంటే రెండు ఆకులు ఎక్కువే చదివా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

అణిచివేయాలని చూస్తే సహించేది లేదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఉపాసన!

Big Stories

Advertisement
×