Mohan Babu:మోహన్ బాబు .. ‘కలెక్షన్ కింగ్’గా టాలీవుడ్ లో ఈయనకి ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు,ఇక మోహన్ బాబు అంటేనే కోపం, టైమ్ సెన్స్, పంక్చువాలిటీ , డైలాగ్ డెలివరీ గుర్తొస్తాయి.మరీ ముఖ్యంగా ఆయన కోపం పై ఇండస్ట్రీలో కథలు కథలుగా మాట్లాడుకుంటారు. అయితే ఆయనలో అందరికీ తెలియని ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు .తాను మోహన్ బాబుతో ఒక సినిమా డైరెక్ట్ చేయాలని ప్రయత్నం చేశానని,ఆ సమయంలో మోహన్ బాబు గురించి దగ్గరగా ఉండి తెలుసుకునే అవకాశం దొరికిందని ఇలా తెలిపాడు.
తానని ఒక సందర్భంలో మోహన్ బాబు ఆఫీసుకు పిలిపించి, ఒక ఇంగ్లీష్ సినిమా క్యాసెట్ ఇచ్చి చూడమని చెప్పారని తెలిపారు.ఇక ఆ సినిమా తనకి బాగా నచ్చడంతో ఒక మంచి ఎంటర్టైనర్గా రీమేక్ చేయవచ్చని అనుకొని స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టామని,ఇక ఈ సినిమా కోసం నలుగురు యంగ్ హీరోలను, కొంతమంది కొత్తవాళ్లను తీసుకోవాలని ప్లాన్ చేశామని తెలిపారు.ఇకఈ క్రమంలో దాదాపు రెండు నెలల పాటు రచయితలు, అసిస్టెంట్ డైరెక్టర్ల టీమ్‌తో కలిసి మోహన్ బాబు ఆఫీస్‌లోనే పనిచేశామని ఆనాటి రోజులని గుర్తుచేసుకున్నారు.
ఇక ఆ సమయంలోనే మోహన్ బాబులోని కొన్ని మంచి లక్షణాలను తాను గమనించానని ఎవరైనా మంచి పని చేసినా లేదా మంచి విషయం చెప్పినా వెంటనే మోహన్ బాబు మనస్ఫూర్తిగా అభినందించేవారని తెలిపాడు. అంతేకాకుండా ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు “ఇప్పుడు మాట్లాడటానికి మీకు వీలుందా?” అని అవతలి వ్యక్తిని అడిగి మరీ మాట్లాడేవాడని ఈ రెండు గుణాలు తనకు బాగా నచ్చి, తాను కూడా వాటిని తన జీవితంలో అలవాటు చేసుకున్నానని తెలిపాడు.
అలాగే, సినిమా కాస్టింగ్ సమయంలో యంగ్ హీరోని అనుకోవడంతో మోహన్ బాబు గారే స్వయంగా అతడికి ఫోన్ చేసి ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పటికీ ఆ హీరో నెగ్లెక్ట్ గా ఆన్సర్ ఇచ్చాడని,దానితో మోహన్ బాబు అసహనం వ్యక్తం చేశారని తెలిపాడు.ఇక తానూ కూడా రియాక్ట్ అవుతూ “అలాంటి వ్యక్తి ఉచితంగా నటించినా సరే మన సినిమాలో వద్దు” అని చెప్పానన్నారు. “ఈ విషయంలో నేను మీకంటే రెండు ఆకులు ఎక్కువే చదివాను” అని మోహన్ బాబుతో సరదాగా అన్నట్లు నవ్వుతూ చెప్పుకొచ్చాడు శివ నాగేశ్వరరావు.
ఇక స్క్రిప్ట్ కంప్లీట్ చేసి సినిమా మొదలు పెడదాము అనుకునే సమయానికి తనకే చేసిన కథ మీద కాన్ఫిడెన్స్ రాలేదని, ఆ విషయం మోహన్ బాబుకి నిజాయితీగా చెప్పానని తెలిపారు.అసలేమాత్రం కాన్ఫిడెన్స్ లేని కథని చేయడం కన్నా సినిమాని ఆపేస్తే మంచిదని అనగా మోహన్ బాబు కూడా తన నిర్ణయాన్ని గౌరవించి ప్రాజెక్ట్‌ను ఆపేశారని . అంతేకాకుండా, పనిచేసిన రైటర్లు, అసిస్టెంట్లకు ముందే రెమ్యూనరేషన్ ఇచ్చేసి, సినిమా ఆగిపోయినా తన కో-డైరెక్టర్‌కు తమ సంస్థలోనే మరో అవకాశం కల్పిస్తామని మోహన్ బాబు చెప్పడం ఆయన గొప్పదనమని ఆకాశానికి ఎత్తేశాడు శివ నాగేశ్వరరావు !
ALSO READ :సినిమా చూడటానికి కాలేజీకి సెలవా.. ఇదేం కొత్త రూల్ మల్లన్నా!