E-Paper
Advertisement

కిలో వెండి రూ.4.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు.. ఇప్పుడు కొంటే లాభమా? నష్టమా?

కిలో వెండి రూ.4.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు.. ఇప్పుడు కొంటే లాభమా? నష్టమా?
Advertisement

Silver Price Crash: ఒకప్పుడు కిలో వెండి కొనాలంటే నాలుగున్నర లక్షల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అదే వెండి ధర లక్షల రూపాయల స్థాయికి చేరిందంటే నమ్ముతారా? పండుగల సీజన్ వచ్చిందంటే బంగారం వెండికి డిమాండ్ పెరగాలి. ధరలు పై పైకి వెళ్ళాలి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు వెండి ధరలను కుదిపేస్తున్నాయి. డాలర్ బలం అమెరికా వడ్డీ రేట్ల పై అంచనాలు చమురు ధరలు ఇలా అన్నీ కలిపి వెండిపై ఒత్తిడి పెంచుతున్నాయి. అసలు వెండి ధర ఇంతలా ఎందుకు పడిపోయింది? బంగారం ధర తగ్గితే వెండిపై ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుంది? దీపావళి టైంలో ధరలు ఇంకా తగ్గుతాయా? ఇప్పుడు వెండి కొనడం మంచిదేనా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం రండి..

వెండి, బంగారం పెరగడానికి గల కారణాలు..

Advertisement

నార్మల్ గా అయితే పండగల సీజన్ వస్తే వెండి బంగారానికి గిరాకి పెరిగి ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి మన లోకల్ డిమాండ్ కంటే అంతర్జాతీయ ఒత్తిల్లే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి అంతర్జాతీయంగా కొనసాగుతున్న చమురు మంటలు ఇంకా అమెరికా డాలర్ ప్రభావం. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు బ్యారెల్ ధర 110 డాలర్లు దాటేసింది. చమురు ధరలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బం పెరుగుతుంది. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించదు. అంతేకాదు ఎక్కువ కాలం అధిక స్థాయిలోనే కొనసాగుతుందనే నమ్మకం పెరిగింది. ఫలితంగా బాండ్ల రిటర్న్స్ పెరిగి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెండి నుంచి అమెరికన్ డాలర్ వైపు మల్లిస్తున్నారు. రెండవది ఇండస్ట్రియల్ స్లో డౌన్ చాలా మందికి వెండి అంటే కేవలం ఆభరణాలు లేదా పూజ సామాగ్రి మాత్రమే అనుకుంటారు. కానీ, వెండి వినియోగంలో 50% కంటే ఎక్కువ పారిశ్రామిక రంగానిదే. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ ఈవీ వాహనాలు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండి కీలక ముడిసరుకు ప్రపంచవ్యాప్తంగా మానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్లో కావడంతో వెండికి డిమాండ్ పడిపోయింది. ఇది కూడా వెండి ధర తగ్గడానికి మరో కారణం.

బంగారం వెండి ధరల మధ్య లింక్..

Advertisement

ఇక బంగారం వెండి ధరల మధ్య లింక్ గురించి చెప్పుకుందాం. బంగారం ధరల్లో వచ్చే మార్పులు ఎప్పుడు వెండిపై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. కానీ బంగారం కంటే ఇప్పుడు వెండి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. రీసెంట్ గా అంతర్జాతీయ మార్కెట్ లో అన్స్ బంగారం ధర 4046 డాలర్లకు దిగిరావడంతో మన దేశీయ మార్కెట్లో 10గ్రాముల బంగారం ధరల 43000 వద్దకు చేరింది. కానీ వెండి మాత్రం రెట్టింపు స్థాయిలో పడిపోయింది. దీనికి రీజన్ అంతర్జాతీయంగా బంగారం వెండి లావాదేవీలు డాలర్లతోనే జరుగుతాయి. డాలర్ బలపడితే ఇతర దేశాల్లో కరెన్సీలో వెండి బంగారం కొనడం ఖరీదైనదిగా మారుతుంది. అయితే బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్లు ఆభరణాల డిమాండ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దానికి సేఫ్ హెవెన్ ఇమేజ్ ఉంది. కానీ వెండికి
ఆభరణాల డిమాండ్ తో పాటు ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా లింక్ అయి ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెండి ధరలో చాలా మార్పులు వస్తాయి.

Also Read: ఇదేంట్రా బాబు.. పశువులకు సోకే ఈ వైరస్ ఇప్పుడు మనుషులకు వస్తోందా?

వెండి ఆభరణాలు కొనాలనుకునే వారు ఏం చేయాలి?

ఇప్పుడు ఇండియన్ మార్కెట్ విషయానికి వద్దాం. సాధారణంగా దసరా దీపావళి దంతరా సమయాల్లో కొనుగోలు విపరీతంగా పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. స్థానిక పండగ గిరాకీ కంటే అంతర్జాతీయ పరిస్థితులే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వెండికి ఇండియాలో డిమాండ్ ఎక్కువగా ఉన్నా ధర మాత్రం ఇలానే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు ఏం చేయాలనేది మరో క్వశ్చన్. గతంలో 4.5 5 లక్షల వద్ద ఉన్నప్పుడు కొనలేకపోయామని బాధపడిన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశమే. కానీ తస్మాత్ జాగ్రత్త అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఎందుకంటే మార్కెట్స్ అన్నీ ఇంకా ఒడిదుడుకుల్లోనే ఉన్నాయి. సో ఎక్కువగా డబ్బులను ఇన్వెస్ట్ చేసి వెండి కొనడం కొంచెం రిస్క్ అని చెబుతున్నారు. మరి దీపావళి పూజల కోసం వెండి నానాలు, ప్రసాదం గిన్నెలు, విగ్రహాలు లేదా పెళ్లిల కోసం వెండి ఆభరణాలు కొనాలనుకునే వారు ఏం చేయాలి? అనేది మరో క్వశ్చన్. గతంతో పోలిస్తే ధర సగం తగ్గడంతో ఇప్పుడు కొనడం బెస్ట్ ఆప్షన్ ఇంకా తగ్గుతుందని వెయిట్ చేయకుండా కొనేయొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే ఇంటి అవసరాలకు భారీగా ఖర్చు చేయడం కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ పడదనేది నిపునుల మాట. అయితే ఇప్పుడు కొంచెం పండుగ టైంలో ఇచ్చే డిస్కౌంట్ తో మరికొంచెం బెటర్ అని చెప్తున్నారు.

Tags

Related News

జాబ్ ఇంటర్వ్యూలో ఏఐ స్కిల్స్ గురించి అడిగితే ఏం చెప్పాలి? కంపెనీలు మీ నుంచి ఆశించే సమాధానం ఇదే

ఏడాదికి రూ.3.25 కోట్ల వరకు వేతనం.. ఏఐ కంపెనీలో రైటర్లు కావలెను మీరూ ట్రై చేసేయండి

ఆర్థిక సంక్షోభం వస్తే ఎలా భరించాలి? ఎమర్జెన్సీ ఖర్చులకు అప్పు చేయకుండా ఈ 3 పనులు చేయండి

దీపావళి వేళ బాణాసంచా ప్రమాదాలు.. కేవలం రూ.11కే ఇన్సూరెన్స్.. రూ.25,000 వరకు కవరేజ్

తండ్రిపై కోర్టుకెక్కిన కూతురు.. పీపీఎఫ్ డబ్బులు తీసుకున్నారని కేసు.. తీర్పు ఇదే

కార్పొరేట్ జాబ్ వద్దు వ్యవసాయం ముద్దు.. పొలం బాట పడుతున్న కోట్ల మంది గ్రాడ్యుయేట్లు

అమెరికాలో లక్ష డాలర్ల జీతం..  ఇండియాలో ఎంత సంపాదనతో సమానం?

Big Stories

Advertisement
×