E-Paper
Advertisement

శర్వా ‘భోగి ‘కూడా ఆ దారిలోనే వెళ్తుందా?

శర్వా  ‘భోగి ‘కూడా ఆ దారిలోనే వెళ్తుందా?
Advertisement

Bhogi Glimpse:ఒకప్పుడు సినిమాలో కాసింత లవ్, కాసింత యాక్షన్ ,కాసింత ఎమోషన్ మధ్య మధ్యలో కామెడీ అన్నట్టుగా ఉండేది.కాని ట్రెండ్ మారింది.ఇపుడు సినిమాలన్నీ బడ్జెట్ బ్యారియర్స్ దాటేయడంతో ప్యాన్ ఇండియా ట్యాగ్ వేసుకోవాలన్న ఆరాటం పెరిగిపోయింది.ఈ క్రమంలో నే సినిమాలలో బ్లడ్ బాత్ పారించడం కామన్ అయిపోయింది.

మొన్న వచ్చిన టాక్సిక్ లో ఈ వైపరి ఈ వైపరీత్యం ఏ రేంజ్ లో ఉందో కళ్లారా చూసాం. సినిమాలో కథ ఉందా లేక బ్లడ్ బాత్ కోసమే సినిమా చేశారా అన్నది తేల్చుకోలేక జుట్టు పీక్కున్నారు ఆడియన్స్ కనపడితే అంతు చూస్తా అంటూ ప్రత్యర్థుల మీదికి ఎగబడటం చూసి ఆడియన్స్ నోరు తేలేశారు. కొట్టాలి అనిపించినప్పుడు కొట్టాలి కానీఇలా కనిపిస్తే చాలు కొట్టేస్తా అన్నట్టుగా ఎడాపెడ సినిమాల్లో బ్లడ్ బాత్ పారించాడు యష్ .

Advertisement

ఇక ప్యారడైజ్ సినిమాలోని నాని ఏ రకమైన బ్లడ్ బాత్ పారించాడో ప్రత్యక్షంగా చూశాం.ఒక రకంగా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఇది సహించలేక థియేటర్లకి దూరంగా జరిగారన్నది కాదనలేని సత్యం .ముఖ్యంగా పక్కింటి అబ్బాయి అన్న టాగ్ వేసుకున్న నాని ఇలా విపరీతంగా వెండితెరపై రక్తాన్ని ఏరులై పారించడం సహించలేకపోయారు. మొత్తానికి బ్లడ్ బాత్ ని నమ్ముకున్న రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి .

ఇక తాజాగా వస్తున్న శర్వానంద్ భోగి కూడా ఇదే జానర్‌లోకి వెళ్లబోతుందా? అన్న టాక్ వినిపిస్తుంది.తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ అనుమానం రావడం సహజమే.ఇప్పటివరకు శర్వానంద్ అంటే ఎక్కువగా లవ్, ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్ కలిసిన సినిమాలే గుర్తొస్తాయి. అయితే ‘భోగి’ విషయంలో మాత్రం ఆయన పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపిస్తున్నట్టు గ్లింప్స్ చూస్తేనే అర్థం అవుతుంది. హీరో లుక్, బ్యాక్‌డ్రాప్, యాక్షన్ సీన్స్ అన్నీ చూస్తే సినిమా మామూలు కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదనేది అర్థమవుతుంది.

Advertisement

‘భోగి’ గ్లింప్స్‌లో ముఖ్యంగా హింసకు సంబంధించిన విజువల్స్ హైలైట్ అవుతున్నాయి. కత్తులు, దాడులు, రక్తంతో కూడిన షాట్స్.. ఇలా సినిమా ఎంత డార్క్‌గా ఉండబోతుందో గ్లింప్స్‌లోనే ఒక ఐడియా ఇచ్చేశారు. అయితే కేవలం గ్లింప్స్ చూసి రెండు సినిమాల కథలు ఒకటేనని చెప్పలేం. కానీ ట్రీట్‌మెంట్ విషయంలో మాత్రం కొన్ని పోలికలు కనిపిస్తున్నాయనే టాక్ వస్తుంది .ఏది ఏమైనా కేవలం బ్లడ్ బాత్ ని నమ్ముకుని సినిమా చేస్తే మాత్రం పై రెండు సినిమాలలా దారి తప్పడం పక్కా

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×