E-Paper
Advertisement

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!
Advertisement

BC Rights: బీసీ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీల హక్కుల కోసం మాట్లాడే ధైర్యాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చారని, ఆయన, మల్లికార్జున ఖర్గేల ఆశీస్సులతో భవిష్యత్ రోజుల్లో తెలంగాణకు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పీసీసీ చీఫ్​ స్పష్టం చేశారు.

జనాభా ప్రకారం వాటా..

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో ప్రకటించిన ‘‘జనాభా ప్రకారం వాటా రావాలి” అనే నినాదానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. బీసీలకు రావాల్సిన వాటాను గౌరవంగా తీసుకుంటామని, అవసరమైతే పోరాడి లాక్కుంటామని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం బీసీలను దారుణంగా వంచిస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వారంతా దద్దమ్మలు..

Advertisement

కేంద్రం చేపడుతున్న సర్వే ఫారమ్‌లో ఎస్సీ, ఎస్టీ కాలమ్‌లను ఉంచి, ఓబీసీ కాలమ్‌ను ఎత్తివేసారని మండిపడ్డారు. తెలంగాణలో బీసీల హక్కుల కోసం ప్రధాని మోదీ, అమిత్ షాల వద్ద మాట్లాడే ధైర్యం రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేదని, వారంతా దద్దమ్మలని విమర్శించారు. మోదీది రాతి గుండె అని, ఆయన గద్దె దిగే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.

Also read: బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

Tags

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×