E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రామాయణ టీమ్ కి భారీ షాక్.. 11 సెకండ్ల వీడియో లీక్!

రామాయణ టీమ్ కి భారీ షాక్.. 11 సెకండ్ల వీడియో లీక్!
Advertisement

Ramayana Movie:సాధారణంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది అంటే ఆ సినిమాను ఎంత పగడ్బందీగా థియేటర్లలోకి తీసుకొస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అటు నిర్మాతలు , ఇటు చిత్ర బృందం ఎక్కడా ఎటువంటి లీక్ జరగకుండా అత్యంత కఠినంగా నియమాలను పాటిస్తూ.. తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఉంటారు. వంద కోట్ల బడ్జెట్ మూవీకే ఈ రేంజ్ లో పగడ్బందీ అంటే.. ఇక ఏకంగా 4 వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలకు సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉండాలో అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నిత్యం లీక్ లకు గురి అవుతూ.. సినిమా కథ బయటికి వస్తుంటే ఆ సినిమాపై అంచనాలు పెరగడం కాదు కదా.. విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పటికే మీ అందరికీ అర్థమయిపోయి ఉంటుంది. రూ.4000 బడ్జెట్ మూవీ ఏంటో అదే బాలీవుడ్ రామాయణ్ మూవీ.

రామాయణ్ నుండి చిన్న క్లిప్ లీక్..

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సౌత్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సీతగా, కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా అవతరించిన కన్నడ హీరో యశ్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ చిత్రం రామాయణం. ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ మొదలయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది . తాజాగా సినిమాకాన్ ఈవెంట్లో ప్రదర్శించిన అఫీషియల్ ట్రైలర్ నుంచి ఒక 11 సెకండ్ల నిడివి ఉన్న క్లిప్ లీక్ అయ్యింది అంటూ ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వీడియోలో ఏముందంటే?

Advertisement

వీడియో సారాంశం ప్రకారం.. శ్రీరాముడి అవతారంలో రణబీర్ కపూర్ కనిపిస్తూ.. తన ముందు ఉన్న ఒక భారీ రాక్షసుడిపై బాణం గురిపెట్టి విసరడం కనిపిస్తోంది. ఇకపోతే ఈ 11 సెకండ్ల లీక్డ్ వీడియోలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో అనుకున్నంత ఏం లేడు అనే కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి . ముఖ్యంగా ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా విమర్శలు గుప్పిస్తున్నారు.పైగా ఈ వీడియోలో రణబీర్ కపూర్ రాముడి పాత్ర కంటే కూడా ఆయన ముందు నిలబడిన ఒక భారీ ఆకారం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ రాక్షసుడిని చూసిన నెటిజన్లు అది కింగ్ కాంగ్ లేదా గాడ్జిల్లా లా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు అంతేకాదు ఈ లీక్డ్ వీడియో క్లిప్ పై మీమ్స్ , ట్రోల్స్ వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

also read:నాగబంధం సీక్వెల్ త్వరలో.. సినిమా వెనుక కష్టాలు బయటపెట్టిన హీరో!

వీడియోపై ట్రోల్స్..

Advertisement

లోకీ సిరీస్ లోని విజువల్స్ లా ఇది ఉంది అని ఒకరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు రామాయణంలో ఇలాంటి వింత ఆకారపు రాక్షసుడు ఎక్కడున్నాడు? అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొకరైతే నాకు మళ్ళీ ఆది పురుష్ వైబ్స్ కనిపిస్తున్నాయని కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది ఇలాంటి అర్థంలేని కథల కోసమా రూ.4వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటూ ఎవరికి వారు మండిపడుతూ ఫైర్ అవుతున్నారు .

ఫేక్ వీడియో?

మరోవైపు.. ఇది నిజంగానే ట్రైలర్ నుంచి లీకైన 11 సెకండ్ల నిడివి ఉన్న వీడియోనా లేక ఏఐతో సృష్టించిన ఫేక్ వీడియోనా అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం పరుస్తున్నారు. మరి ఈ అనుమానాలకు తెరపడాలి అంటే మేకర్స్ అఫీషియల్ గా గ్లింప్స్ రిలీజ్ చేస్తే తప్ప దీని వెనుక ఉన్న అసలు విషయం అర్థం కాదు. ఏది ఏమైనా ఇలాంటి లీక్డ్ వీడియోల వల్ల సినిమా పనితనం దెబ్బ తీయడమే కాకుండా సినిమాపై హైప్ పెరగడానికి దారులు లేకుండా పోతున్నాయని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ కి తెరపడాలి అంటే మేకర్స్ స్పందించాల్సిందే.

Related News

సీఎం విజయ్ జననాయగన్ కు తప్పని తిప్పలు.. మళ్లీ సెన్సార్ షాక్!

Theater Releases : ఈ వారం బాక్సాఫీస్ వార్ తప్పదా..? పోటీ మాములుగా లేదు..

Hero Nani : హీరో నాని చేతికి గాయాలు.. షాక్ లో ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే..?

కనులపండుగగా మెహర్ రమేష్ కుమార్తె వివాహ రిసెప్షన్.. తరలివచ్చిన టాలీవుడ్ అగ్ర తారలు!

పద్మశ్రీ అందుకున్న తొలి కమెడియన్.. రేలంగి వెనుక ఉన్న ఈ కన్నీటి గాథ తెలుసా?

బ్రేకప్ అయ్యిందా? అయితే .. పార్టీ చేసుకోండి …అంటున్న హాలీవుడ్ బ్యూటీ

టైమ్ కన్నా ముందే వారణాసి ప్యాకప్..జక్కన్న స్పీడ్ మాములుగా లేదుగా

Big Stories

×