America: ఆ యంగ్ జంటకు అదొక థ్రిల్. తమ ప్రేమను ప్రపంచానికి బలంగా చాటాలనుకున్నారు. మనసులోని వచ్చిన ఆలోచనను ఓకే అమల్లోకి పెట్టారు. పీక్స్‌కు చేరింది.. అనుకోని సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ ఆ జంట పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.
1454 అడుగుల ఎత్తైన టవర్‌పై లవ్ ప్రపోజ్
అమెరికాలోని ఎంపైర్ స్టేట్ భవనంపైకి ఎక్కింది రష్యాకు చెందిన ఓ జంట. ఆ టవర్ ఎత్తు ఎంతో తెలుసా? 1454 అడుగుల ఎత్తు. భవనంపై ఉన్న ట్రాన్స్‌మిషన్ టవర్ శిఖరానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఓ బ్యానర్‌ను ఆవిష్కరించి, తమ ప్రేమను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. అనంతరం యువకుడు.. సదరు యువతికి లవ్ ప్రపోజ్ చేశాడు.
అందుకు ఆమె మనస్సాక్షిగా అంగీకరించింది. టవర్‌పై ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఆ తర్వాత ఆ పని కానిచ్చారు. ఆ జంట చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఈ వ్యవహారం చివరకు పోలీసుల దృష్టికి వెళ్లింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ జంటను అరెస్ట్ చేశారు.
అమెరికాలోని ఎంపైర్ స్టేట్ భవనం.. ఆ తర్వాత జంట అరెస్ట్
రష్యాకు చెందిన యంగ్ జంట ఏంజెలా నికోలౌ-వాన్యా బీర్కస్. ఇద్దరు ముఖాలకు మాస్కులు ధరించి, ఆపై టవర్‌పైకి ఎక్కారు. అంతేకాదు ఈ తతంగాన్ని ఆ జంట సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేసింది. టవర్ దిగువ ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్న తర్వాత వాన్యా.. మోకాలిపై కూర్చుని ఏంజెలాకు ప్రపోజ్ చేశాడు. ఆమె వెంటనే ఓకే చేయడంతో అక్కడే చిన్నపాటి ఎంగేజ్‌మెంట్ జరిగింది.
ఈ సన్నివేశంతో అప్రమత్తమైన పోలీసులు.. భవనం అబ్జర్వేషన్ డెక్‌ను ఖాళీ చేయించారు. పరిసర ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసి, ఆ జంట కిందకు దిగిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అయితే టవర్‌పైకి వారు ఎలా ఎక్కారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?
🚨 BREAKING: 2 people have climbed the Empire State Building in New York to fly a flag. The flag reads “When the power of love beats the love of power the world knows peace.” pic.twitter.com/YrIudqf9Lx
— FOX 4 NEWS (@FOX4) July 1, 2026