E-Paper
Advertisement

ప్రభాస్ స్టైలిష్ విధ్వంసానికి 17 ఏళ్లు.. మెహర్ రమేష్ ‘ఫాస్టెస్ట్’ రికార్డ్ ఇదే!

ప్రభాస్ స్టైలిష్ విధ్వంసానికి 17 ఏళ్లు.. మెహర్ రమేష్ ‘ఫాస్టెస్ట్’ రికార్డ్ ఇదే!

Billa Movie: ఇప్పుడంటే ‘స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్’ సినిమాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయ్ కాని ఈ సినిమాలకి సరైన కేరాఫ్ ఏదంటే 17ఏళ్ల కింద వచ్చిన బిల్లా అనే చెప్పాలి.రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే ఓ స్పెషల్ అండ్ స్టైలిష్ ఫిలిమ్ గా నిలిచిపోయిన ఈ సినిమా సరిగ్గా 17ఏళ్ల కిందట అంటే ఏప్రిల్ ౩న రిలీజ్ అవడం తో సోషల్ మీడియాలో #17YearsForBilla హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ లోకి తీసుకొచ్చారు రెబల్ ఫ్యాన్స్.

కేవలం 4 నెలల్లోనే షూట్ కంప్లీట్

ఇప్పుడంటే పెద్ద హీరోలతో ఫారిన్ లోకేషన్లలో సాలిడ్ సీక్వెన్స్ లు తీయాలంటే ఏళ్లకేళ్ళు తీసుకుంటున్నారు కాని అప్పట్లోనే ప్రభాస్ లాంటి భారీ కటౌట్ ఉన్న హీరోతో,మలేషియా లాంటి ఇంటర్నేషనల్ లొకేషన్లలో కేవలం 4 నెలల్లోనే షూట్ కంప్లీట్ చేసి ట్రేడ్ వర్గాలకి పెద్ద షాకే ఇచ్చాడు మెహెర్.అంతకుముందు వరకు ప్రభాస్ అంటేనే ఊర మాస్.ఇక ‘ఛత్రపతి’, ‘వర్షం’ లాంటి సినిమాల్లో కూడా మాస్ లుక్‌లోనే మెప్పించాడు.కానీ బిల్లాలోమేకోవర్, స్టైలిష్ సూట్స్ ,రాయల్ బాడీ లాంగ్వేజ్‌ , కాస్ట్లీ లుక్ లో ‘ఇంటర్నేషనల్ డాన్’ లా అదరగొట్టిన ప్రభాస్ ని చూసి ఆయన ఫ్యాన్స్ మెస్మరైజ్ అయిపోయారు. ఇక పవర్ ఫుల్ ‘బిల్లా’గా, అమాయకపు ‘రంగా’గా ప్రభాస్ చూపించిన వేరియేషన్స్ అయితే అద్భుతం.ఇక ఇదే సినిమాలో ప్రభాస్ కి జోడీగా ‘మాయ’ పాత్రలో అదరగొట్టింది అనుష్క.ముఖ్యంగా ఆమె బికినీ లుక్ అప్పట్లో టాలీవుడ్‌లో పెద్ద సెన్సేషన్.ఇక నమిత, హన్సిక (స్పెషల్ రోల్) గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్.

ప్రభాస్ చెప్పే చాలా డైలాగ్స్ ఇప్పటికీ గూస్‌బంప్స్

ఇక ఈ సినిమాలో డైలాగ్స్ కూడా బాగా పేలాయి. మరీ ముఖ్యంగా బిల్లా పాత్రలో ఆయన గొంతు సీరియస్ గా  ఉంటే, రంగా పాత్రలో కాస్త వేగంగా, గోదావరి యాసతో కూడిన యాస తో  ప్రభాస్ చెప్పే చాలా డైలాగ్స్ ఇప్పటికీ గూస్‌బంప్స్ తెప్పిoచేవే . జయసుధ  అండర్ కవర్ కాప్ గా ఒక షాకింగ్ ట్విస్ట్ ఇవ్వడం అయితే  సినిమాకే హైలైట్‌.ఇక ఈ మూవీలో ప్రభాస్ ఎక్కువగా వాడిన డైలాగ్స్‌లో ‘హస్త లా విస్టా’ అనే డైలాగ్. ఈ సినిమా మనం ఎన్నో సార్లు చూశాం కానీ.. దీని అర్థం ఏంటో అని చాలా మందికి తెలియదు. అసలు ఈ డైలాగ్‌ అర్థం ఏంటో తెలుసా?  స్పానిష్ బాషలో ఉన్న ఈ పదానికి అర్థం తెలుగులో మళ్లీ కలుద్దాo అని .

సినిమాని మరో లెవల్ కి తీసికెళ్ళిన  మణిశర్మ

ఇక “మై నేమ్ ఈజ్ బిల్లా”, “బొమ్మాలి” పాటలతో సినిమాని మరో లెవల్ కి తీసికెళ్ళాడు మణిశర్మ. ఇవి ఇప్పటికీ డీజేల్లో మోగిపోతుంటాయంటే ఎంతగా ఇంపాక్ట్ చూపించాయో అర్థం అవుతుంది.ముఖ్యంగా సినిమాలో బిల్లా గన్ పట్టుకున్నప్పుడు వచ్చే ఆ గిటార్ రిఫ్ ఇప్పటికీ ప్రభాస్ ఎలివేషన్ సీన్లకు ట్రేడ్ మార్క్.ఇక సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా చేసిన సౌందర్ రాజన్ మలేషియా అందాలను, హై-స్పీడ్ ఛేజింగ్ సీన్లను హాలీవుడ్ రేంజ్‌లో కెమెరాలో బంధించాడని సినిమా చూసిన వాళ్లెవరైనా చెబుతారు.

also read:బాలయ్య …ది’ కింగ్ ఆఫ్ స్పీడ్’

16 కోట్ల బిజినెస్ జరుపుకున్న సినిమా

ఇకపోతే అప్పటి వరకు వాడకంలో ఉన్న రెంజ్, గ్రీన్ మరియు గోల్డెన్ షేడ్స్ కాకుండా ‘కూల్ బ్లూ’ టోన్‌ను వాడి టాలీవుడ్ సినిమా యాక్షన్ సినిమాలకి సరికొత్త కలర్ ట్రెండ్ ఇంట్రొడ్యూస్ చేశాడు మెహెర్. ఈ సినిమాని ప్రభాస్ సొంత బ్యానర్ అయిన గోపీ కృష్ణ మూవీస్ లో కృష్ణంరాజు ఎంతో ప్రెస్టేజియస్ నిర్మించడమే కాకుండా తొలిసారి ఐజీ పాత్రలో ప్రభాస్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ తో కలిసి నటించడం విశేషం.మరో విశేషం ఏమిటంటే, ఈ సినిమా ప్రమోషన్స్. అవును ..అప్పట్లో ప్రభాస్ బిల్లా లుక్‌లో ఉన్న భారీ కటౌట్లు థియేటర్ల వద్ద తెగ హల్చల్ చేశాయ్.ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ.12 కోట్ల వరకు బడ్జెట్ అయింది. అయితే రిలీజ్ టైమ్‌లో సినిమాకు బీభత్సమైన హైప్ రావడంతో బిజినెస్ భారీగా జరిగింది. దాదాపు రూ.16 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫైనల్ రన్‌లో రూ.16.04 కోట్ల షేర్ సాధించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది కాని మిగిలిన రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ కాలేదన్న టాక్ ఉంది .

also read:అట్లీ మార్క్ ‘హ్యాండ్’.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్

మేకింగ్ లో మా విజన్‌ను మ్యాచ్ చేసిన మ్యాజిక్

ఇక 1978లో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన ‘డాన్’కు తమిళ రీమేక్ గా, 1980లో రజనీకాంత్ ‘బిల్లా’ సినిమా చేయగా దానికి రీమేక్ గా కొన్ని మార్పులతో 2007లో అజిత్ కుమార్ హీరోగా ‘బిల్లా’ మూవీని తెరకెక్కించాడు విష్ణు వర్ధన్.ఇక ఇదే కథను తీసుకొని తెలుగులో అదే పేరుతో ప్రభాస్ తో రీమేక్ చేశారు మెహర్ రమేష్ .సినిమా కథ విషయానికి వస్తే మలేషియాలో పోలీసుల ఛేజింగ్ లో డాన్ చనిపోతే , అతని స్థానంలోకి అదే పోలికలతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక దొంగ రావడం, పెద్ద ఆయుధాల ఒప్పందంపై నిఘా సమాచారాన్ని సేకరించి పోలీసులకు చేరవేసే కోవర్ట్ మిషన్ చెప్పడం అనేదే ‘బిల్లా’ సినిమా కథ.ఇక సినిమా 2008 నవంబర్ 12న షూట్ స్టార్ట్ చేసి 2009 ఏప్రిల్ 3న థియేటర్లలోకి తెచ్చారు. టాలీవుడ్‌లో ఒక భారీ చిత్రాన్ని ఇంత వేగంగా పూర్తి చేయడం అప్పట్లో ఒక రికార్డు..ఇక ”సినిమా 17 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడంతో “2008 నవంబర్ 12న కెమెరా స్విచ్ ఆన్ చేశాం.. 2009 ఏప్రిల్ 3కల్లా థియేటర్లలోకి తెచ్చేశాం. మేకింగ్ లో మా విజన్‌ను మ్యాచ్ చేసిన మ్యాజిక్ ఇది. మన గుండెల్లో నిలిచిపోయిన డాన్ ప్రభాస్” అంటూ మెహర్ రమేష్ తన ఎమోషన్‌ను పంచుకోవడం విశేషం.”ఏది ఏమైనా  ఎన్ని బిల్లాలు వచ్చినా తెలుగులో ప్రభాస్ చూపించిన ‘స్వాగ్’ మాత్రం యూనిక్ అనే చెప్పాలి.

 

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×