E-Paper
Advertisement

నింగిలోనూ తప్పని సాఫ్ట్‌వేర్ తిప్పలు.. ఆర్టెమిస్ II లో మొరాయించిన మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్!

నింగిలోనూ తప్పని సాఫ్ట్‌వేర్ తిప్పలు.. ఆర్టెమిస్ II లో మొరాయించిన మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్!
Advertisement

IT Support Reaches Lunar Orbit: సాధారణంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌తో వచ్చే సాంకేతిక సమస్యలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కంప్యూటర్ ఒక్కసారిగా హ్యాంగ్ అవ్వడం, విండోస్ అప్‌డేట్ అవుతున్నప్పుడు సిస్టమ్ ఆగిపోవడం.. అవుట్‌లుక్ వంటి అప్లికేషన్లు సరిగ్గా పని చేయకపోవడం వంటివి నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఈ సాఫ్ట్‌వేర్ తిప్పలు కేవలం భూమి మీద ఉన్న సామాన్యులకే కాదు.. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు కూడా తప్పడం లేదు. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ II (Artemis II) చంద్రయాన మిషన్‌లో భాగంగా నింగిలోకి వెళ్లిన వ్యోమగాములు, ప్రయాణం మొదలైన కొద్ది గంటల్లోనే మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ పని చేయక ఇబ్బందులు ఎదుర్కోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అంతరిక్ష ప్రయాణ చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలిచిన ఆర్టెమిస్ II మిషన్, ఏప్రిల్ 1, 2026న ఘనంగా ప్రారంభమైంది. ఆర్టెమిస్ II కమాండర్ రీడ్ వైస్‌మ్యాన్ తన పర్సనల్ కంప్యూటింగ్ డివైజ్ లో అవుట్‌లుక్ పని చేయడం లేదని హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్‌కు ఫిర్యాదు చేశారు. “నా డివైజ్‌లో రెండు అవుట్‌లుక్ అప్లికేషన్లు కనిపిస్తున్నాయి. కానీ ఏదీ ఓపెన్ కావడం లేదు. మీరు రిమోట్ ద్వారా వీటిని తనిఖీ చేస్తే బాగుంటుంది.” అని ఆయన కోరారు. దీంతో భూమిపై ఉన్న నాసా ఇంజనీర్లు రిమోట్ యాక్సెస్ ద్వారా వ్యోమగామి డివైజ్‌ను సరిచేశారు. అంతరిక్షంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ పరిమితుల వల్ల అది ఆఫ్‌లైన్ లో ఉన్నట్లు చూపించినా, మెయిల్‌ను విజయవంతంగా రీస్టోర్ చేశారు.

Advertisement

అంతరిక్షంలో అవుట్‌లుక్ మొరాయించిన వార్త బయటకు రావడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. “అంతరిక్షంలో అవుట్‌లుక్ వాడటం సాహసమే.. దానికంటే పావురాలకు స్పేస్ సూట్లు వేసి పంపినా సమాచారం వేగంగా అందుతుంది.” అని ఒక యూజర్ ఎద్దేవా చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లోని స్పేస్ ఫోర్స్ సిరీస్‌లో విండోస్ అప్‌డేట్ వల్ల మిషన్ ఆగిపోయే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ మరికొందరు మీమ్స్ షేర్ చేశారు. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు భూమిపైనే కాదు, నింగిలో కూడా యూజర్లను ఇబ్బంది పెడుతున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కమాండర్ రీడ్ వైస్‌మ్యాన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్టులు క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్ ఈ చారిత్రాత్మక యాత్రలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ మిషన్ భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులు ల్యాండ్ కావడానికి అవసరమైన కీలక రిహార్సల్‌గా ఉపయోగపడనుంది. సాంకేతిక సమస్యలు ఎన్ని ఎదురైనా, నాసా శాస్త్రవేత్తలు వాటిని భూమి నుండి సమర్థవంతంగా పరిష్కరిస్తూ మిషన్‌ను ముందుకు నడిపిస్తున్నారు.

Advertisement

Read Also: ఒరాకిల్‌లో మాస్ లేఆఫ్స్.. వారే టార్గెట్.. ఈ లేఆఫ్స్ వెనుక ఒక వింతైన అల్గారిథమ్!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×