E-Paper
Advertisement

ఆశలు వదిలేసిన చోట అద్భుతం.. స్టేజ్-4 క్యాన్సర్ రోగిని కాపాడిన వైద్యులు

ఆశలు వదిలేసిన చోట అద్భుతం.. స్టేజ్-4 క్యాన్సర్ రోగిని కాపాడిన వైద్యులు

Robotic Surgery: స్వేచ్ఛ బ్యూరో: ఉదర సంబంధిత క్యాన్సర్ నాలుగో దశలో ఉన్న రోగికి రోబోటిక్ సర్జరీ నిర్వహించి పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని అందించినట్లు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణుడు డా. సచిన్ మర్దా తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

చిన్న వయసులో క్యాన్సర్

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం వంటి కారణాలతో దేశంలో క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల చిన్న వయస్సులోనే క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ అనేది ఒకే రకమైన వ్యాధి కాకుండా, 100కు పైగా రకాల అసాధారణ కణాల అదుపు లేని పెరుగుదల వల్ల ఏర్పడే క్లిష్టమైన వ్యాధుల సమాహారమని వివరించారు.

ప్రతి సంవత్సరం 2 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 20 మిలియన్లకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ‘డిస్కవర్ హెల్త్’ కార్యక్రమం ద్వారా సమగ్ర అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు మమ్మోగ్రఫీ వంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ బారిన పడ్డవారు ధైర్యం కోల్పోకుండా ఉంటే చికిత్సకు శరీరం మెరుగ్గా స్పందిస్తుందని, కోలుకునే అవకాశాలు అధికమవుతాయని తెలిపారు.

క్యాన్సర్ రోగులకు ధైర్యం నింపే పుస్తకం

జిల్లాకు చెందిన ఓ రోగి ఉదర క్యాన్సర్ నాలుగో దశలో తమ వద్దకు వచ్చాడని, ముందుగా మానసికంగా ధైర్యం ఇచ్చి, రోబోటిక్ సర్జరీ ద్వారా క్యాన్సర్ కణాలను తొలగించి పూర్తిగా కోలుకునేలా చేసినట్లు వివరించారు. ఇది తమ వైద్య సేవలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. తన 20 ఏళ్ల వైద్య అనుభవంలో అనేక మంది క్యాన్సర్ రోగులు కోలుకున్నారని పేర్కొన్నారు. క్యాన్సర్‌ను జయించిన వారి జీవిత గాథలను ‘ఐ యామ్ అన్ష్టాపబుల్ – టుగెదర్ వి విన్’ అనే పుస్తకంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పుస్తకం రోగులకు ధైర్యాన్ని నూరిపోస్తుందని చెప్పారు. ప్రపంచ స్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యశోద ఆసుపత్రిలో చికిత్సలు అందిస్తున్నామని, క్లిష్టమైన కేసులను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని డా. సచిన్ మర్దా వెల్లడించారు.

Also Read:మహబూబ్‌నగర్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజన్ ఇదే!

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×