Sankranti Movies 2027: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పటిలాగే 2027 వ సంవత్సరం కూడా బోలెడు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. 2026 సంక్రాంతితో పోలిస్తే.. 2027 సంక్రాంతి పండగకు కాస్త ఎక్కువగానే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కళ్యాణ్ రామ్ నిఖిల్ వంటి స్టార్ హీరోలు సంక్రాంతికి పోటీ పడుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఏ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
2027 సంక్రాంతికి దాదాపు 5 సినిమాలు పోటీ పడుతున్నాయి.. ఈ ఏడాది రిలీజ్ అయిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విషయాన్ని అందుకున్నాయి. వచ్చేయడాది రిలీజ్ కాబోతున్న సినిమాల విషయానికొస్తే…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావ్ ఇప్పుడు కాంబినేషన్ వచ్చినా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ఏడాది సంక్రాంతి రిలీజ్ అయింది.. ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం చిరంజీవి మరో రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి కాంబినేషన్లో ఓ సినిమా తెలుగు ఎక్కుతున్న విషయం తెలిసిందే.. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందట.. ప్రస్తుతం చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో చేస్తున్న మల్టీస్టారర్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుంది..
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నరసింహం బాలయ్య ఈ ఏడాది నటించిన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను సొంతం చేస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ వచ్చేయడాది సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది..
Also Read :Intinti Ramayanam Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. అప్పుడే శుభం కార్డు..?
నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏ విధంగా విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన్ మూవీ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సక్సెస్ ని సాధించి ఈ ఏడాది ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న అనిల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఓ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.. మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతి కూడా స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. మరి ఈ సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విన్నర్ గా నిలుస్తుందో అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇకపోతే ఏడాది జూన్ నుంచి స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ కాబోతున్నాయి ఈనెల నాలుగో తేదీన రాంచరణ్ నటించిన పెద్ది మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో అన్నది తెలియాల్సి ఉంది..