E-Paper
Advertisement

హైదరాబాద్‌లో సాయంత్రం పవన్ మీడియా సమావేశం, దీనికైనా పోలీసులు పర్మిషన్ ఇస్తారా?

హైదరాబాద్‌లో సాయంత్రం పవన్ మీడియా సమావేశం, దీనికైనా పోలీసులు పర్మిషన్ ఇస్తారా?
Advertisement

Hyderabad: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం వేళ నవ నిర్మాణ సభకు ఏర్పాటు చేసుకుంది జనసేన పార్టీ. చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టుని ఆశ్రయించనుంది ఆ పార్టీ. పరిస్థితులు గమనించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నట్లు వెల్లడించారు. కనీసం ప్రెస్ మీట్ కు పోలీసులు పర్మిషన్ ఇస్తారని ఆశిస్తున్నానంటూ రాసుకొచ్చారు.

హైదరాబాద్‌లో సాయంత్రం పవన్ మీడియా సమావేశం

Advertisement

జనసేన పార్టీ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సభ లేనట్టేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై న్యాయస్థానానికి వెళ్తామని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. తీర్పు వచ్చేసరికి సమయం ఎంత అవుతుందో తెలీదని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా మరొక ట్వీట్ చేశారు.

మంగళవారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల మధ్య జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కనీసం పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడానికి తెలంగాణ పోలీసు శాఖ నాకు అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు.

Advertisement

మీడియా సమావేశానికి పోలీసులు పర్మిషన్ ఇస్తారని ఆశిస్తున్నా-జనసేన అధినేత

జనసేన అధినేత ఈ విధంగా పోస్టు పెట్టడం ఇదే తొలిసారని అంటున్నారు. సభ పెట్టి మాట్లాడే కంటే చెప్పాల్సిన నాలుగు మాటలు మీడియా సమావేశంలో పెట్టి చెబితే బాగుంటుందని కొందరు నేతలు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఆ ట్వీట్ చేశారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. సకల జనుల సంకల్పం… అమరుల త్యాగాల రూపం… మన తెలంగాణ అని రాసుకొచ్చారు.

ALSO READ: కేంద్రమంత్రి బండి సంజయ్ కోసం ఊహించని యాత్ర

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులని ప్రస్తావించారు.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×