E-Paper
Advertisement

AA 23xLK7: ఐకాన్ స్టార్ కోసం ప్రభాస్ హీరోయిన్.. సూపర్ కాంబో సెట్ చేసిన లోకేష్!

AA 23xLK7: ఐకాన్ స్టార్ కోసం ప్రభాస్ హీరోయిన్.. సూపర్ కాంబో సెట్ చేసిన లోకేష్!
Advertisement

AA 23xLK7: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం ఈయన అట్లీ డైరెక్షన్లో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 50% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ సినిమా ఎవరితో ఉండబోతుందనే విషయంపై ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి.

బన్నీ కోసం బాలీవుడ్ బ్యూటీ..

ఈ వార్తలకు తెరదించుతూ అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని మరొక తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)డైరెక్షన్ లో చేయబోతున్నట్టు అధికారికంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో లోకేష్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గురించి గత కొద్ది రోజులుగా ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించగా తాజాగా మరొక హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది అల్లు అర్జున్ జోడిగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్(Shraddha Kapoor ) హీరోయిన్ నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి దాదాపు శ్రద్ధ కపూర్ ఈ సినిమాలో ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.

బన్నీకి జోడిగా శ్రద్ధ కపూర్..

Advertisement

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తుంది. ఈమె ఇదివరకే ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో హీరోయిన్గా నటించిన సౌత్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సినిమా కోసం శ్రద్ధా కపూర్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది..

సూపర్ పవర్స్ ఉన్న హీరోగా..

Advertisement

ఇక అల్లు అర్జున్ కోసం లోకేష్ కనకరాజ్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. సూపర్ పవర్స్ ఉన్న హీరో కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇందులో అల్లు అర్జున్ తన కుడిచేతిని కోల్పోయి మెటల్ హ్యాండ్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తన డ్రీం ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతోంది.

Also Read: Thalaivat 174: ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. కమల్, రజినీ మల్టీస్టారర్ ఫిక్స్… డైరెక్టర్ ఎవరంటే?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×