E-Paper
Advertisement

Thalaivat 174: ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. కమల్, రజినీ మల్టీస్టారర్ ఫిక్స్… డైరెక్టర్ ఎవరంటే?

Thalaivat 174: ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. కమల్, రజినీ మల్టీస్టారర్ ఫిక్స్… డైరెక్టర్ ఎవరంటే?
Advertisement

Thalaivar 174: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రజనీకాంత్ కమల్ హాసన్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటికీ విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఈ ఆశలు నెరవేరబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలుస్తుంది.

ఫిబ్రవరిలో అధికారక ప్రకటన..

ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కమల్ హాసన్ రజనీకాంత్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. ఇద్దరు హీరోలకు ఈ స్క్రిప్ట్ వినిపించగా వీరిద్దరూ కూడా ఈ మల్టీ స్టార్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారంలో ప్రోమో ద్వారా అధికారకంగా ప్రకటన తెలియజేయబోతున్నారు. ఈ ప్రోమోకి సంబంధించిన షూటింగ్ కూడా నెల్సన్ పూర్తి చేశారని సమాచారం.

అనిరుద్ సంగీత సారధ్యంలో…

Advertisement

ఇక ఈ మల్టీ స్టార్ సినిమాకు అనిరుద్ సంగీతం అందించగా , ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించబోతున్నారు. ఇక ఈ సినిమాకు రాజ్ కమల్ ఫిల్మ్ నిర్మాణంలో రాబోతుందని తెలుస్తోంది. ఇలా రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే విషయం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.. రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం ఈయన కమల్ హాసన్ నిర్మాణంలో సిబి చక్రవర్తి డైరెక్షన్ లో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే .

మెప్పించలేకపోయిన కూలీ…

Advertisement

ఈ సినిమా రజినీకాంత్ కెరియర్ లో 173 వ సినిమా కావటం విశేషం. ఈ సినిమా అనంతరం నెల్సన్ డైరెక్షన్ లో ఈ మల్టీ స్టార్టర్ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతోంది. ఈ విధంగా రజనీకాంత్ ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలకు కమిట్ అయి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.. ఇక ఈయన చివరిగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కూలీ అనకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

Also Read: Samantha : భర్త విషయంలో సమంత కీలక నిర్ణయం..అప్పుడు చైతూ..ఇప్పుడు రాజ్

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×