E-Paper
Advertisement

Milk and Acne: పాలు తాగితే మొటిమలు వస్తాయా? ఈ రెండింటికీ మధ్య సంబంధం ఏమిటి?

Milk and Acne: పాలు తాగితే మొటిమలు వస్తాయా? ఈ రెండింటికీ మధ్య సంబంధం ఏమిటి?
Advertisement

యువతలో, పని చేసే మహిళల్లో మొటిమల సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అయితే పాలు, పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే మొటిమలు వస్తాయన్న సందేహం ఎక్కువ మందిలో కలుగుతోంది.చాలామంది రోజూ పాలు, పెరుగు, చీజ్, వెన్న వంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అయితే ఇవే చర్మ సమస్యలకు కారణమవుతాయా అనే సందేహం పెరుగుతోంది. నిపుణుల చెబుతున్న ప్రకారం డెయిరీ ఉత్పత్తులు కొన్ని సందర్భాల్లో మొటిమల సమస్యను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకు వస్తాయి?
పాలలో సహజంగా కొన్ని హార్మోన్లు ఉంటాయి. ముఖ్యంగా IGF-1 (ఇన్సులిన్ లాంటి గ్రోత్ హార్మోన్) పాలు తాగినప్పుడు శరీరంలో పెరుగుతుంది. ఈ హార్మోన్ చర్మంలోని ఆయిల్ గ్రంథులను ఎక్కువగా పనిచేయిస్తుంది. దాంతో ముఖంపై నూనె ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ నూనె రంధ్రాల్లో దుమ్ము, మురికి చేరి మొటిమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారిలో డెయిరీ ఉత్పత్తులు తీసుకుంటే మొటిమల సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Also read: Coriander Pongali: కొత్తిమీర పొంగలి ఎప్పుడైనా తిన్నారా? రుచి అదిరిపోద్ది.. ఇదిగో రెసిపీ

ఏ రకమైన పాలు?
అన్ని రకాల పాలు ఒకేలా ప్రభావం చూపవు. ముఖ్యంగా స్కిమ్డ్ మిల్క్ (కొవ్వు తీసేసిన పాలు) మొటిమల సమస్యను ఎక్కువగా పెంచుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పూర్తి కొవ్వు ఉన్న పాలు కంటే స్కిమ్డ్ మిల్క్‌లో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. అలాగే చీజ్, ఐస్‌క్రీమ్, బటర్ వంటి ప్రాసెస్డ్ డెయిరీ ఉత్పత్తులు కూడా మొటిమలను ప్రేరేపించవచ్చు. అయితే ప్రతి ఒక్కరికీ ఇదే ప్రభావం ఉంటుందని చెప్పలేం. కొందరికి ఎలాంటి సమస్య రాకపోవచ్చు.

Advertisement

పాలు తాగితే తప్పనిసరిగా మొటిమలు వస్తాయన్నది పూర్తిగా నిజం కాదు. శరీర స్వభావం, హార్మోన్ల స్థితి, జీవనశైలి మీద ఇది ఆధారపడి ఉంటుంది. మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారు కొంతకాలం డెయిరీ ఉత్పత్తులు తగ్గించి చూసుకోవచ్చు. అలా చేస్తే చర్మంలో మార్పు వస్తుందా లేదా అన్నది గమనించాలి. అవసరమైతే డాక్టర్ లేదా డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిది. కాల్షియం కోసం పాలు తప్పనిసరిగా కావాలంటే బాదం పాలు, సోయా పాలు, ఓట్స్ మిల్క్ వంటి ప్రత్యామ్నాయాలను కూడా తీసుకోవచ్చు.

మొటిమలు రాకుండా ఏం చేయాలి?
మొటిమల సమస్యను తగ్గించుకోవాలంటే కేవలం ఆహారంపై మాత్రమే కాకుండా మొత్తం జీవనశైలిపై దృష్టి పెట్టాలి. రోజూ తగినంత నీరు తాగాలి. నూనె ఎక్కువగా ఉన్న ఆహారం, ఫాస్ట్ ఫుడ్ తగ్గించాలి. ముఖాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఎక్కువగా మేకప్ వాడకుండా ఉండటం మంచిది. అలాగే ఒత్తిడి, నిద్రలేమి కూడా మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి సరైన నిద్ర, వ్యాయామం చాలా అవసరం. డెయిరీ ఉత్పత్తులు మొటిమలకు కారణమవుతాయా లేదా అన్నది వ్యక్తిగతంగా మారుతుంది. కాబట్టి శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి నిర్ణయం తీసుకోవడమే ఉత్తమం.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×