E-Paper
Advertisement

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్.. మళ్లీ వాయిదా పడిన ఇట్లు అర్జున..!

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్.. మళ్లీ వాయిదా పడిన ఇట్లు అర్జున..!
Advertisement

Itlu Arjuna Postponed: టాలీవుడ్ యంగ్ హీరో అనీష్, అందాల ముద్దుగుమ్మ అనస్వర రాజన్ (Anaswara Rajan)జంటగా నటించిన తాజా చిత్రం ఇట్లు అర్జున(Itlu Arjuna). మహేష్ ఉప్పాల దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హ్యాష్ టాగ్ మీడియా, వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అదే రోజు ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbham) సినిమా విడుదల ప్రకటించడంతో వాయిదా పడి అక్టోబర్ 9న విడుదల కాబోతున్నట్లు తెలిపారు. ఇక ఆదర్శ కుటుంబం ఇట్లు అర్జున సినిమాని వెంబడిస్తూనే వస్తుంది. అయితే ఆదర్శ కుటుంబం విడుదల నుంచి తప్పుకోవడంతో అక్టోబర్ 30న ఇట్లు అర్జున విడుదల కాబోతుందని తెలిపారు.

వాయిదా పడిన ఇట్లు అర్జున..

ఇక ఈ సినిమా ప్రమోషన్లను వేగవంతం చేస్తూ విడుదలకు అంతా సిద్ధమవుతుందనుకున్న సమయంలో ఊహించని విధంగా ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 30వ తేదీ రాబోతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 30న విడుదల కాబోతున్న సినిమాలన్నీ కూడా వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇలా పెద్ద సినిమాల విడుదలపై సరైన స్పష్టత లేని నేపథ్యంలో చిన్న సినిమాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తద్వారా నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని చెప్పాలి. ఇక ఆదర్శ కుటుంబం సినిమా కారణంగా మరోసారి ఇట్లు అర్జున వాయిదా వేయాల్సి వచ్చింది.

త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాం..

Advertisement

ఇక ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేస్తూ.. అక్టోబర్ 30వ తేదీ విడుదల కావలసిన ఇట్లు అర్జున సినిమా మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి తాము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాము. త్వరలోనే కొత్త విడుదల తేదీకి సంబంధించి వివరాలను తెలియజేస్తామని, అప్పటివరకు మా చిత్ర బృందానికి మీ ప్రేమ మద్దతు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈసారి మరింత రెట్టింపు వినోదంతో ఇట్లు అర్జున థియేటర్లలోకి రాబోతుందని కచ్చితంగా తెలియజేస్తున్నాం అంటూ ఈ సినిమా వాయిదా గురించి నిర్మాతలు అధికారకంగా తెలియజేశారు.

Advertisement

ఈ విధంగా ఇట్లు అర్జున సినిమా మరోసారి వాయిదా పడటంతో పలువురు నెటిజన్స్ ఆదర్శ కుటుంబం సినిమాపై విమర్శలు కురిపిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు రెండు రోజుల ముందు విడుదల తేదీని ప్రకటించినా మంచి ఆదరణ వస్తుంది కానీ చిన్న సినిమాల నిర్మాతల పరిస్థితి ఏంటి? వారిని దృష్టిలో పెట్టుకొని పెద్ద సినిమాల విడుదల తేదీలను ఖరారు చేస్తే బాగుంటుందని తెలుపుతున్నారు. ఇక ఇదే విషయం గురించి ఇట్లు అర్జున సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున(Nagarjuna) కూడా ఫైర్ అయ్యారు. ఒక సినిమా విడుదల తేదీని ప్రకటించాము అంటే కచ్చితంగా అదే తేదీకి విడుదల కావాలని లేకపోతే విడుదల తేదీని ప్రకటించకూడదంటూ నాగార్జున కూడా మండిపడిన సంగతి తెలిసిందే.

Also Read: ఇంత అహంకారమా?  నాగార్జున ఫైర్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలిని?

Related News

దుల్కర్ సినిమాలో రుహాని శర్మ.. బిజిలిగా కొత్త అవతారం!

రాజశేఖర్‌తో బాబూమోహన్ స్నేహం వెనుక ఇంత కథ ఉందా?

మోహన్ బాబు కంటే రెండు ఆకులు ఎక్కువే చదివా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

అణిచివేయాలని చూస్తే సహించేది లేదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఉపాసన!

సినిమా చూడటానికి కాలేజీకి సెలవా.. ఇదేం కొత్త రూల్ మల్లన్నా!

అవంతిక మిశ్రా అందాల జాతర.. ఆ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్న మెగా డాటర్ నిహారిక!

Big Stories

Advertisement
×