Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు కార్యక్రమం 48వ రోజు పూర్తి అయింది. ఇక నేడు వీకెండ్ కావడంతో నాగార్జున(Nagarjuna) బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు తాజాగా నేడు జరిగే ఎపిసోడ్ కి సంబంధించి వరుస ప్రోమోలు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన సెకండ్ ప్రోమో విడుదల చేశారు అయితే ఇందులో భాగంగా నాగార్జున కంటెస్టెంట్ శాలిని(Shalini) వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
షాలిని గతవారం ఎలిమినేట్ అయినట్టు చూపించారు కానీ ఈమెను హౌస్ నుంచి బయటకు పంపించకుండా సీక్రెట్ రూమ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. ఇలా సీక్రెట్ రూమ్ లో ఉన్న శాలిని కంటెస్టెంట్ ల ఆట తీరును గమనించి ఇకపై తాను ఎలా ఆడాలో పూర్తిగా అర్థమైంది అంటూ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక ఈమె హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తోటి కంటెస్టెంట్లపై కోప్పడటం రోహిత్ తో గుసగుసలు చెప్పడంతో ఈమె వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదని చెప్పాలి. ఇక తను ఎవిక్ట్ అయి వచ్చిందంటూ కంటెస్టెంట్లు తనని మాట్లాడటంతో ఈమె ఎమోషనల్ అయ్యారు.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నాగార్జున ఇదే విషయం గురించి మాట్లాడటంతో ప్రతి ఒక్కరు తనని ఇబ్బంది పెడుతున్నారని షాలిని చెప్పగా వారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది నువ్వు నిజంగానే మారిపోయావా అంటూ ఈకంటెంట్ల పై గొడవ పడిన వీడియో విడుదల చేశారు. ఇక నువ్వు ఏం మారావు? ఎందుకంత అహంకారం? మనం ఎవరినైనా ఏదైనా అన్నప్పుడు వాళ్లు ఎలా తీసుకుంటారో వాళ్లు మనల్ని అన్నప్పుడు అదేవిధంగా తీసుకోవాలి అంటూ నాగార్జున తెలిపారు.
ఇలా నాగార్జున షాలిని వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు లేదంటూ ఆమెను తిట్టడంతో వెంటనే షాలిని సారీ చెప్పగా నాగార్జున మాత్రం ఎన్నిసార్లు ఇలా సారీలు చెబుతావు? అంటూ మాట్లాడారు. షాలిని నాకు ఉండాలనిపించడలేదని చెప్పడంతో నిజంగానే నీకు హౌస్ లో ఉండడం ఇష్టం లేకపోతే ఇప్పుడే హౌస్ నుంచి బయటకు వచ్చేసేయ్ అంటూ నాగార్జున చెప్పగా వెంటనే శాలిని తాను హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతానని చెప్పారు. వెంటనే నాగార్జున కూడా బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేయమని చెప్పడంతో గేట్స్ కూడా ఓపెన్ అవుతాయి. మరి నిజంగానే శాలిని ఈసారి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతారా ?లేదంటే తన మనసు మార్చుకొని హౌస్ లోనే కొనసాగుతారా? ఇక ఈమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది తెలియాలి అంటే ఈరోజు ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి. ఇక నేడు ఎపిసోడ్ లో భాగంగా దక్షి హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారని తెలుస్తోంది.
Also Read: అణిచివేయాలని చూస్తే సహించేది లేదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఉపాసన!