E-Paper
Advertisement

ఐపీఎస్ పేరుతో ఘరానా మోసాలు.. ఎలా ప‌ట్టుబ‌డ్డాడంటే..

ఐపీఎస్ పేరుతో ఘరానా మోసాలు.. ఎలా ప‌ట్టుబ‌డ్డాడంటే..
Advertisement

Fake IPS Officer:స్వేచ్ఛ బ్యూరో: నకిలీ పోలీస్​ అవతారమెత్తి వరుసగా నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తుని పై సైబరాబాద్ కమిషనర్​ డాక్టర్​ ఎం.రమేశ్​ పీడీ యాక్ట్​ ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆదాయం కోసం పోలీస్ అవతారం..

Advertisement

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలానికి చెందిన నాగరాజు రఘువర్మ అలియాస్​ వంశీ (29) కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. మొదట్లో డ్రైవర్​ గా పనిచేశాడు. దీని ద్వారా ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో తేలికగా డబ్బు సంపాదించి జల్సాగా జీవితం గడపాలని నేరాల బాట పట్టాడు. ఈ క్రమంలో ఐపీఎస్ అధికారిగా నటిస్తూ టార్గెట్ చేసుకున్న వారిని మీపై వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని చెప్పేవాడు. చట్టపరమైన చర్యలు తప్పవని భయపెట్టేవాడు, కేసుల నుండి కాపాడతామని చెప్పి డబ్బులు వసూలు చేసేవాడు. అంతేకాకుండా, వ్యక్తులను కిడ్నాప్ చేసి, తుపాకులు చూపించి వారి వద్ద ఉన్న నగదును దోచుకునేవాడు. ఇలా 2017 నుంచి 2026 మధ్య కాలంలో మోసం, కిడ్నాప్, దోపిడీ, బలవంతపు వసూళ్లు, నేరపూరిత బెదిరింపుల వంటి నేరారోపణలతోపాటు మారణాయుధాల నిరోధక చట్టం ప్రకారం అతనిపై 14 కేసులు నమోదయ్యాయి.

నాగరాజు రఘ వర్మపై పీడీ యాక్ట్..

Advertisement

ఇంతకు ముందు 2021, 2024లో పీడీ యాక్ట్ ప్రకారం రిమాండ్​ కు పంపించినా జైలు నుంచి విడుదల కాగానే నాగరాజు నేరాలు చేయటాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో కిడ్నాప్, బలవంతపు వసూళ్లు, దోపిడీకి సంబంధించిన మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే నాగరాజుపై పీడీ యాక్ట్ ను ప్రయోగిస్తూ కమిషనర్ రమేశ్​ మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో జగద్గిరిగుట్ట పోలీసులు నాగరాజును అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్ చేశారు.

Also Read: ఉమ్మడి చిత్తూరులో ఎలక్షన్ హీట్.. నామినేషన్ల రగడ.. కలెక్టర్ క్లాస్!

Tags

Related News

ఆఫీస్‌లో నీచమైన పని.. బాత్రూంలో ఫోన్ పెట్టి వీడియోలు తీసిన అటెండర్!

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ.. ఆ పరీక్షను వాయిదా వేయండి?

మాదాపూర్‌లో హైడ్రా సంచలన ఆపరేషన్.. ఇళ్ల బెడ్‌రూమ్‌, కిచెన్‌లలో వేసిన బోర్లు బట్టబయలు!

2017 నుండి గంజాయి అమ్ముతున్న వృద్ధురాలు అరెస్ట్!

విజయవాడ ట్రిప్‌లో విషాదం.. లారీని ఢీకొన్న కారు, ఇద్దరు యువకులు మృతి!

నేను చెప్పిన పద్ధతి ఫాలో అవ్వండి.. నీళ్లు ఎట్లా రావో చూస్తా: జగదీశ్వర్ రెడ్డి!

కాంగ్రెస్‌లో కుర్చీ లాటరీ.. జెండా మోసినోళ్లకు హ్యాండ్.. జంప్ జిలానీలకే హవా!

Big Stories

Advertisement
×