E-Paper
Advertisement

ఆదర్శ కుటుంబం ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్..ఎప్పుడు? ఎక్కడంటే?

ఆదర్శ కుటుంబం ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్..ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Aadarsha Kutumbham Trailer: విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47(Aadarsha Kutumbham House no.47). మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ ఈ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక నేడు దసరా పండుగను పురస్కరించుకొని వెంకటేష్(Venkatesh) ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా అక్టోబర్ 30 వ తేదీ విడుదల అవుతుందని, ఈసారి ఎలాంటి మార్పులు ఉండబోవని వెంకటేష్ తెలియజేశారు.

అక్టోబర్ 22న ట్రైలర్..

ఇక ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారకంగా ప్రకటించడంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ అలాగే రెండు పాటలను విడుదల చేయగా ఈ పాటలకు మంచి ఆదరణ లభించింది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్(Trailer) అలాగే ఫ్రీ రిలీజ్ వేడుకకు(Pre Release Event) సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ వేడుకను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించడం కోసం మేకర్స్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ అక్టోబర్ 22వ తేదీ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్..

Advertisement

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అక్టోబర్ 26వ తేదీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఈ సినిమా ట్రైలర్ ,ఫ్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే చిత్ర బృందం నుంచి అధికారక ప్రకటన రాబోతోంది. ఇక వెంకటేష్ జోడిగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) సందడి చేయబోతున్నారు. సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ వీడియో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. మరి అక్టోబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

కుటుంబ కథ నేపథ్యంలో..

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటే కుటుంబ కథ నేపథ్యంలోనే ఉంటాయి మరోవైపు వెంకటేష్ కూడా కుటుంబ కథ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఆదర్శ కుటుంబం సైతం ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని ఇటీవల విడుదల చేసిన టీజర్ చూస్తేనే స్పష్టమవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ సినిమాల కోసం ఇదివరకు డైలాగ్ రైటర్ గా కథా రచయితగా పనిచేశారు కానీ మొదటిసారి దర్శకుడిగా పని చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

Advertisement

Also Read: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన నటి వితికా షేర్… తొలి అడుగు అంటూ!

Related News

బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన నటి వితికా షేర్… తొలి అడుగు అంటూ!

చిన్న కూతురి పేరు రివీల్ చేసిన దీపిక పదుకొనె… ఫోటో వైరల్!

నిన్న ఫౌజీ.. నేడు స్పిరిట్ వాయిదాల దిశగా ప్రభాస్ సినిమాలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

నేను చనిపోయాకా నా ఆస్తి మొత్తం వాళ్ళకే… రజినీకాంత్ షాకింగ్ డేసిషన్!

దేవిశ్రీప్రసాద్ ‘ఎల్లమ్మ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

పెళ్లి పీటలెక్కబోతున్న సాయి ధరంతేజ్.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!

రణబాలి 2 మూవీ పై రాహుల్ బిగ్ అప్డేట్.. ఫాన్స్ కు పూనకాలు గ్యారెంటీ!

Big Stories

Advertisement
×