E-Paper
Advertisement

బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన నటి వితికా షేర్… తొలి అడుగు అంటూ!

బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన నటి వితికా షేర్… తొలి అడుగు అంటూ!
Advertisement

Vithika sheru: వితికా షేర్ టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈమె అనంతరం తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొని సందడి చేశారు. ఇక బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తున్న ఈమె ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్నారు. వితికా షేర్(Vithika Sheru)  తాజాగా దసరా పండుగను పురస్కరించుకొని అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు. వితికా ఇంస్టాగ్రామ్ వేదికగా తన కొత్త బిజినెస్ గురించి అభిమానులకు తెలియజేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

లవ్ లిస్ట్ క్యూరేటేడ్ ఫ్యాషన్ బ్రాండ్..

ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లమో పూర్తి చేసిన వితికా షేర్  ఎప్పటినుంచో దుస్తుల వ్యాపారం లోకి అడుగు పెట్టాలని తనకంటూ ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేయాలని కోరికగా ఉండేది. అయితే నేడు ఆ కలను నిజం చేసుకుంటూ ఈమె లవ్ లిస్ట్ (Lovelist) పేరుతో ఒక కొత్త బిజినెస్ ప్రారంభించారు. లవ్ లిస్ట్ పేరుతో తనకొత్త క్యూరేటేడ్ ఫ్యాషన్ బ్రాండ్ ను నేడు అధికారకంగా ప్రకటించారు. ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని వారి అందాన్ని పెంపొందించేలా దుస్తులను డిజైన్ చేయడమే లక్ష్యంగా ఈ వ్యాపారాన్ని ఈమె ప్రారంభించారు.

ఎంట్రప్రెన్యూర్ గా తొలి అడుగు..

Advertisement

కొత్త బిజినెస్ కి సంబంధించిన విషయాన్ని వితికా షేర్ చేస్తూ..ఎంట్రప్రెన్యూర్ గా తన మొదటి అడుగు వేశానని త్వరలో హైదరాబాద్లో ఈ బ్రాండ్ కి సంబంధించిన స్టోర్ వివరాలను అందరికీ తెలియ చేయబోతున్నట్టు ఈ సందర్భంగా వితిక షేర్ ఇంస్టాగ్రామ్ వేదికగా తన కొత్త బిజినెస్ కి సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకున్నారు .ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈమె ప్రముఖ సినీ నటుడు వరుణ్ సందేశ్(Varun Sandesh) భార్య అనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఈమె వరుణ్ సందేశ్ తో కలిసి పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమాలో నటించారు.

Advertisement

ఇలా ఈ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడటం అనంతరం పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగింది. ఇక పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ వరుణ్ సందేశ్ మాత్రం పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు త్వరలోనే ఈయన నా వైఫ్ మిస్సింగ్ అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .ఈ సిరీస్ అక్టోబర్ 22వ తేదీఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోంది. ఇక వితికా మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ భారీ స్థాయిలో సంపాదిస్తున్నారని చెప్పాలి. ఈమె ఇప్పటికే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా భారీ స్థాయిలో ఆదాయం అందుకుంటున్న వితిక ఇప్పుడు బిజినెస్ లోకి అడుగు పెట్టడంతో అభిమానులు ఈమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

Also Read: చిన్న కూతురి పేరు రివీల్ చేసిన దీపిక పదుకొనె… ఫోటో వైరల్!

Related News

ఆదర్శ కుటుంబం ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్..ఎప్పుడు? ఎక్కడంటే?

చిన్న కూతురి పేరు రివీల్ చేసిన దీపిక పదుకొనె… ఫోటో వైరల్!

నిన్న ఫౌజీ.. నేడు స్పిరిట్ వాయిదాల దిశగా ప్రభాస్ సినిమాలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

నేను చనిపోయాకా నా ఆస్తి మొత్తం వాళ్ళకే… రజినీకాంత్ షాకింగ్ డేసిషన్!

దేవిశ్రీప్రసాద్ ‘ఎల్లమ్మ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

పెళ్లి పీటలెక్కబోతున్న సాయి ధరంతేజ్.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!

రణబాలి 2 మూవీ పై రాహుల్ బిగ్ అప్డేట్.. ఫాన్స్ కు పూనకాలు గ్యారెంటీ!

Big Stories

Advertisement
×