E-Paper
Advertisement

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ లేఖలు ఉంటే దర్శనం బంద్!

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ లేఖలు ఉంటే దర్శనం బంద్!
Advertisement

TTD Darshan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి రావడంతో, భక్తుల రద్దీ, పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శనం, వసతి గదుల కేటాయింపుకు సంబంధించిన సిఫార్సు లేఖలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే అనుమతి

Advertisement

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి వచ్చే ఎలాంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. అయితే, స్వయంగా తిరుమల క్షేత్రానికి వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రం నిబంధనల ప్రకారం దర్శన సౌకర్యం, వసతి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వారి స్థానంలో ఇతరులు లేఖలతో వస్తే మాత్రం దర్శనాలు కేటాయించబడవని పేర్కొంది.

సాధారణ భక్తులకే ప్రథమ ప్రాధాన్యం

Advertisement

సిఫార్సు లేఖలపై తాత్కాలికంగా బ్రేక్ వేయడం వల్ల సాధారణ భక్తులకు మరింత లబ్ధి చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. కోటా ఆదా అవ్వడం ద్వారా సామాన్య భక్తులకు శ్రీవారి శీఘ్ర దర్శనంతో పాటు వసతి పొందేందుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసి, ప్రవర్తనా నియమావళి ఎత్తివేసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

భక్తులు సహకరించాలి: టీటీడీ విజ్ఞప్తి

తిరుమల యాత్రకు సిద్ధమయ్యే భక్తులు ఈ మార్పులను గమనించి దేవుని దర్శనానికి రావాలని అధికారులు సూచించారు. అనవసరంగా సిఫార్సు లేఖలతో వచ్చి సమయాన్ని వృధా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. స్వామివారి దర్శనం సఫీగా జరిగేందుకు, క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భక్తులందరూ టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

Also Read: విజయనగరంలో కూటమి శ్రేణుల జోష్.. 62 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత!

Tags

Related News

దమ్ముంటే నీ కొడుకులను పోటీలో నిలబెట్టు.. కేతిరెడ్డికి జేసీ సవాల్!

విజయనగరంలో కూటమి శ్రేణుల జోష్.. 62 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత!

శ్రీకాకుళంలో ఘోర విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన నలుగురు విద్యార్థులు.. ఇద్దరు మృతి!

చంద్రబాబూ.. ఇవి విజయాలు అనుకుంటే పొరపాటే!- సజ్జల రామకృష్ణారెడ్డి

నగరిలో మళ్లీ ఎన్నికలు గ్యారెంటీ.. కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న రోజా వ్యాఖ్యలు!

కూటమిలో జెడ్పీటీసీ-ఎంపీటీసీ సీట్ల లొల్లి.. 50- 60 శాతం మేము పోటీ చేస్తాం- నాగబాబు

కడపలో వైసీపీ మేయర్ అభ్యర్థి ఇంటిపై దాడి.. ఆరుగురు వ్యక్తులు ఎవరు? స్కార్పియోలో వచ్చి

Big Stories

Advertisement
×