E-Paper
Advertisement

ఆదర్శ కుటుంబం సెకండ్ సింగిల్ ‘మాల’ లిరికల్ సాంగ్ రిలీజ్!

ఆదర్శ కుటుంబం సెకండ్ సింగిల్ ‘మాల’ లిరికల్ సాంగ్ రిలీజ్!
Advertisement

Aadarsha Kutumbham: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh)శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbham ). తొలిసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ ఈ సినిమాలో నటించిన నేపథ్యంలో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా తరచూ వాయిదా పడుతూ వస్తోంది. అక్టోబర్ రెండు నుంచి 9 వ తేదీకి వాయిదా పడిన ఈ సినిమా తదుపరి 9వ తేదీ కూడా వాయిదా పడింది.

నారాయణమ్మ సాంగ్..

ఇలా ఆదర్శ కుటుంబం సినిమా తరచు వాయిదా వేస్తున్న నేపథ్యంలో వెంకటేశ్ అభిమానులు కూడా త్రివిక్రమ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కొత్త విడుదల తేదీని అధికారకంగా ప్రకటించబోతున్నామని ఈ విడుదల తేదీన స్వయంగా వెంకటేష్ ప్రకటిస్తారు అంటూ నిర్మాత నాగ వంశీ ఇటీవల ఒక కార్యక్రమంలో తెలియజేశారు. ఈ సినిమా వాయిదా వేస్తూ ఉన్నప్పటికీ సినిమా ప్రమోషన్లను మాత్రం ఆపడం లేదు. ఇదివరకే ఈ సినిమా నుంచి నారాయణమ్మ అంటూ సాగిపోయే పస్ట్ సింగల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఆదర్శ కుటుంబం సెకండ్ సింగిల్…

Advertisement

ఆదర్శ కుటుంబం నుంచి సెకండ్ సింగిల్ మాల (Maala Song)అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. వెంకటేష్ శ్రీనిధి మధ్య వచ్చే ఈ రొమాంటిక్ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పాటకు సరస్వతీ పుత్రుడు రామ జోగయ్య శాస్త్రి లిరిక్ రైటర్ గా పనిచేయగా సింగర్ శ్రీకృష్ణ, రమ్య బెహరా ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూనే మరోవైపు యాక్షన్ ఎలెమెంట్స్ కూడా ఉన్నాయని ఇటీవల సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ చూస్తేనే తెలుస్తుంది.

Advertisement

ఫ్యామిలీ కథ సినిమాలకు వెంకటేష్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ సైతం వెంకటేష్ కోసం అద్భుతమైన ఫ్యామిలీ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ ఈ సినిమా చేయడంతో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఆదర్శ కుటుంబం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదివరకు వెంకటేష్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా, కథా రచయితగా పనిచేశారు కానీ ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు మాత్రం రాలేదు. మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆదర్శ కుటుంబం రాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది తెలియాలంటే చిత్ర బృందం అధికారకంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read: జైలర్ 2 మూవీ.. రజిని మనవడి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Related News

కాఫీ విత్ కరణ్‌ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్‌!

తెరపైకి సింగర్ పీ సుశీలమ్మ బయోపిక్ చిత్రం? హీరోయిన్ ఎవరంటే?

కావ్యతో పెళ్లి.. వైరల్ గా మారిన అనిరుధ్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!

జైలర్ 2 మూవీ.. రజిని మనవడి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు.. ఏకంగా ముగ్గురు అరెస్ట్!

విజయ్, ర‌ష్మిక మైల్ స్టోన్ మూవీగా ‘రణబాలి’.. బ్లాక్ బస్టర్ టాక్ తో దూకుడు..

రామ్ పోతినేని సినిమాలో జెనిలియా భర్త.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×