E-Paper
Advertisement

జైలర్ 2 మూవీ.. రజిని మనవడి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జైలర్ 2 మూవీ.. రజిని మనవడి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

Child Artist Ritvik: సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులకు కూడా ఎంతో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్టులుగా మంచి గుర్తింపు సంపాదించుకొని అంతరం హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో చైల్డ్ ఆర్టిస్టుగా తన నటనతో మెప్పించి ఎంతో మంది ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న వారిలో చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్(Ritvik) ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ అంటే టక్కున గుర్తు పెట్టకపోయిన లక్కీ భాస్కర్(Lucky Bhaskar) సినిమాలో దుల్కర్ సల్మాన్ కొడుకు అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తాడు.

రజనీకాంత్ మనవడిగా..

పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన రిత్విక్ తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth)నటించిన జైలర్ 2 (Jailer 2)సినిమాలో నటించి సందడి చేశారు. ఈ సినిమాలో రజనీకాంత్ మనవడి పాత్రలో రిత్విక్ నటన అందరిని మెప్పించింది. ఇలా ఈ సినిమాలో రిత్విక్ పాత్ర కూడా కీలకగా మారడంతో రిత్విక్ కి సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రిత్విక్ రెమ్యూనరేషన్ (Remuneration) కి సంబంధించిన వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి.

లక్షల్లో రిత్విక్ రెమ్యూనరేషన్…

Advertisement

జైలర్ 2 సినిమాలో రజనీకాంత్ మనవడి పాత్ర చేసినందుకుగాను రిత్విక్ సుమారు పది లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం. ఇలా ఒక సినిమా కోసం ఏడేళ్ల వయసులోనే రిత్విక్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇక రిత్విక్ జైలర్ 2 సినిమా కంటే ముందుగా లక్కీ భాస్కర్ సినిమాలో నటించి సందడి చేశారు.

లక్కీ భాస్కర్ సినిమాతో గుర్తింపు..

లక్కీ భాస్కర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన రిత్విక్ అంతకుముందు నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఓ 2, సర్దార్ వంటి సినిమాలలో నటించారు కానీ లక్కీ భాస్కర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమయ్యారు. ఇక తాజాగా జైలర్ 2 సినిమాతో మరింత గుర్తింపు పొందారు. జైలర్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగు తమిళ భాషలలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతున్న ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మిథున్ చక్రవర్తి, విజయ్ సేతుపతి, జాకీ ష్రాఫ్, ఎస్ జె సూర్య, యోగి బాబు వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు.

Advertisement

Also Read: త్రివిక్రమ్ కమెడియన్ సునీల్ మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపడ్డాయా?

Related News

తెరపైకి సింగర్ పీ సుశీలమ్మ బయోపిక్ చిత్రం? హీరోయిన్ ఎవరంటే?

ఆదర్శ కుటుంబం సెకండ్ సింగిల్ ‘మాల’ లిరికల్ సాంగ్ రిలీజ్!

కావ్యతో పెళ్లి.. వైరల్ గా మారిన అనిరుధ్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!

టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు.. ఏకంగా ముగ్గురు అరెస్ట్!

విజయ్, ర‌ష్మిక మైల్ స్టోన్ మూవీగా ‘రణబాలి’.. బ్లాక్ బస్టర్ టాక్ తో దూకుడు..

రామ్ పోతినేని సినిమాలో జెనిలియా భర్త.. వీడియో వైరల్!

డైరెక్టర్ పై సోనాలి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.. నిర్మానుష్య ప్రాంతంలో?

Big Stories

Advertisement
×