E-Paper
Advertisement

Akhanda 2 Pre Release: బాలయ్యతో సినిమా అంటే భయపడ్డాను.. ఆది పినిశెట్టి

Akhanda 2 Pre Release: బాలయ్యతో సినిమా అంటే భయపడ్డాను.. ఆది పినిశెట్టి
Advertisement

Akhanda 2 Pre Release: అఖండ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే మారుమోగుతుంది. బాలకృష్ణ(Balakrishna) బోయపాటి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖండ 2 (Akhanda 2)తాండవం సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించగా బాలయ్యతో పోటీ పడటం కోసం యువ హీరో ఆది పినిశెట్టి (Aadi Pinisetty)రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే .ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.

వైరం ధనుష్ గా ఆది పినిశెట్టి..

ఆది పినిశెట్టి సైతం ఈ సినిమాలో బాలయ్యకు పోటీగా నటించారని ఇదివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇలా మొదటిసారి బాలకృష్ణతో కలిసి అఖండ 2 సినిమాలో నటించడం గురించి ఆది పినిశెట్టి ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ తాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటించాను. ఈ సినిమాలో వైరం ధనుష్ గా నా పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు.

బాలయ్య సినిమా అంటే భయమేసింది…

Advertisement

సరైనోడు సినిమా తర్వాత చాలా రోజులకు బోయపాటి గారి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇలా బాలకృష్ణ అఖండ 2 సినిమాలో ఆయనకు వ్యతిరేకంగా నటించాలని చెప్పారు. ఆయన ఆ మాట అనగానే తాను భయపడిపోయానని తెలిపారు. అసలు సెట్ అవుతుందా సర్ అంటూ అడగడంతో చాలా బాగుంటుందని బోయపాటి గారు చెప్పారు. దీంతో కళ్ళు మూసుకొని సినిమా షూటింగ్ కి వెళ్ళపోయానని ఆది పినిశెట్టి తెలిపారు. షూటింగ్ కి వెళ్లే ముందు కూడా బాలయ్య గారి గురించి ఆలోచించి కాస్త భయపడ్డాను కానీ బాలయ్య గారు చాలా కూల్ అంటూ ఆది ఈ సందర్భంగా బాలయ్యతో సినిమా చేయడం గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

విలన్ గా సక్సెస్ అందుకున్న ఆది పినిశెట్టి..

Advertisement

ఇక మొదటిసారి ఆది పినిశెట్టి బాలయ్యతో కలిసి నటించబోతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు కూడా ఎంతో అద్భుత కనబరుస్తున్నారు. ఇదివరకు బోయపాటితో కలిసి ఆది పినిశెట్టి సినిమా చేసినా, బాలకృష్ణతో ఇది మొదటి సినిమా కావటం విశేషం. ఇటీవల ఆది పినిశెట్టి హీరోగా కంటే కూడా విలన్ పాత్రలలోనే ఎక్కువగా నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక అఖండ 2 సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అఖండ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరోసారి బోయపాటి బాలకృష్ణ బాక్సాఫస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించబోతున్నారని సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టం అవుతుంది.

Also Read: Akhanda 2 pre Release: అఖండ 2 సినిమాకు రావడం అంటే గుడికి వచ్చినట్టే..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×