Bigg Boss 9 Telugu Day 82 : బిగ్ బాస్ సీజన్ 9కు త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. ప్రస్తుతం చివరి కెప్టెన్సీ వార్ జరుగుతోంది హౌస్ లో. నామినేషన్ రేంజ్ లో కెప్టెన్సీ కోసం ఫైట్స్ జరిగాయి తాజా ఎపిసోడ్లో. “బిగ్ బాస్ హౌస్ లో చివరి కెప్టెన్సీ సంగ్రామంలో ఇప్పటి వరకు నేను పంపించిన యోధులతో మీరంతా అలుపెరగని పోరాటం చేశారు. ఈ పోరాటంలో ఛాంపియన్స్ కూడా తమ ముందు మోకరిల్లేలా చేసి, విజయ పతాకాన్ని ఎగరేశారు. కెప్టెన్సీ రేసులో లేని సభ్యులు ఎవరైతే ఆ డ్యాగర్ ను ముందు తీసుకుంటారో వాళ్ళు తాము కెప్టెన్ గా ఎవరిని చూడాలి అనుకుంటున్నారో వాళ్లకి ఇవ్వాలి. డ్యాగర్ ను తీసుకున్నవాళ్లు ఎవరు కెప్టెన్ కాకూడదో వాళ్ళకి గుచ్చాలి” అంటూ కెప్టెన్సీ టాస్క్ ను వివరించారు బిగ్ బాస్. ఇక కెప్టెన్సీ కంటెండర్లుగా దివ్య, రీతూ, డెమోన్, కళ్యాణ్, సంజన ఉండగా… కెప్టెన్సీ రేసులో లేని కంటెస్టెంట్స్ లిస్ట్ లో తనూజా, భరణి, సుమన్ శెట్టి ఉన్నారు.
ముందుగా సుమన్ చేతికి డ్యాగర్ రాగా, ఆయన దాన్ని రీతూకి ఇచ్చాడు. ఆమె సంజనాకు గుచ్చి “గేమ్ ను గేమ్ లాగా చూడకుండా పర్సనల్ ఎటాక్ చేశారు. 9 మందితో హౌస్ లో బిలో ది బెల్ట్ మాట్లాడారు” అని చెప్పింది. దీంతో “నీ గేమ్ ఏముంది రీతూ? ఉదయాన్నే.నువ్వు అటు, పవన్ ఇటు… మళ్ళీ ప్యాచప్ అవుతావు” అని ఇచ్చిపడేసింది సంజన. రీతూ “పర్సనల్ గా ఒకరిని అటాక్ చేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళు కెప్టెన్ కావడానికి వీల్లేదు” అంటూ తన పాయింట్ ను చెప్పింది. తరువాత డ్యాగర్ భరణి చేతికి వెళ్లగా, పవన్ కు ఇచ్చాడు. “నేను అడిగినప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు” అని సేమ్ నామినేషన్ పాయింట్ తో ఇమ్మూకి గుచ్చాడు డెమోన్. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయ్యి, “ఇక్కడ గెలవాలి అంటే స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళని తీయాలి. అదే గేమ్. నీకు అలా ఉన్నప్పుడు ఆరోజే రెబల్ టాస్కులో తీసి ఉండాల్సింది. ఇంకోసారి అన్నా నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తది అని చెప్పొద్దు” అంటూ ఫైర్ అయ్యాడు ఇమ్మూ.
తరువాత తనూజా వచ్చి కత్తిని రీతుకి ఇచ్చి “నువ్వు కెప్టెన్సీ కంటెండర్ గా ఉండాలని కోరుకుంటున్నా” అని చెప్పింది. దీంతో “సేఫ్ గేమ్ వద్దు తనూజా. ఇప్పుడే చెప్పావ్ కదా దివ్యను తీయడానికి రీతూకి ఇస్తానని” అంటూ మధ్యలో దూరింది సంజన. “మీకు మీ ఫేవరేట్ ఎలా ఉందో, నాకు నా ఫేవరెట్ అలాగే ఉంది” అంటూ ఆమె నోరు మూయించింది తనూజా. రీతూ వచ్చి “నీకు కత్తి వస్తే నన్ను పొడుద్దామ్ అనుకున్నావ్. అందుకే” అంటూ దివ్యను పొడిచింది. “నిన్ను పొడుస్తా కాబట్టి నన్ను పొడిచావ్ అంతేనా? భయపడి నామినేట్ చెయ్, భయపడి కెప్టెన్సీ నుంచి తియ్యి. దమ్ముంటే నాతో ఆడి గెలువు” అని ఛాలెంజ్ విసిరింది దివ్య. “నువ్వంటే భయం అనుకుంటున్నావు. నీది ఓవర్ కాన్ఫిడెన్స్. నువ్వేమన్నా తోపా ? ” అని సమాధానం చెప్పింది రీతూ. “అవును. నేను నీకంటే పెద్ద తోపు. 9 వారం సగం మంది హౌస్ మేట్స్ నిన్ను నామినేట్ చేశారు. కెప్టెన్ వల్ల ఇమ్యూనిటీ వచ్చింది. 11వ వారం కెప్టెన్ కాబట్టి ఇమ్యూనిటీ వచ్చింది. మళ్ళీ బుద్ధున్నోడు ఎవడైనా నీకు ఇమ్యూనిటీ ఇస్తాడా ? బ్రెయిన్ వాడి నాతో మాట్లాడు రీతూ” అని తాను ఎందుకు రీతూని పొడవాలి అనుకుందో వివరించింది దివ్య. కానీ రీతూ ఏమాత్రం తగ్గలే.
చివరికి డ్యాగర్ ను సంజన తీసుకుని కళ్యాణ్ కు ఇచ్చింది. అది తీసుకునే ముందు కళ్యాణ్ నీకు డ్యాగర్ ఇస్తే ఎవరిని పొడుస్తావ్.అని అడిగాడు. “అది చెప్పలేను” అని డెమోన్ అనడంతో… “నువ్వు కంటెండర్ కాదు కెప్టెన్సీలో నాతో పోటీ పడాలి అనుకుంటున్నా. అది జరగాలంటే రీతూ వెళ్ళిపోవాలి” అని రీతూని పొడిచాడు. చివరగా “రోడ్ టు కెప్టెన్సీ” టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇచ్చిన ఇసుక, కంకరతో గుంతలుగా ఉన్న రోడ్లను పూడ్చి లెవెల్ చేయాలి. ఈ టాస్క్ కళ్యాణ్, డెమోన్ కు మధ్య టాస్క్ పోటాపోటీగా జరిగింది. కానీ చివర్లో డెమోన్ కు గాయం కావడంతో టాస్క్ పూర్తి చేయలేక పడిపోయాడు. దీంతో హౌస్ లో టెన్షన్ వాతావరం నెలకొంది.
Read Also : దొంగతనం చేసి అడ్డంగా బుక్కైన తనూజా, రీతూ… బిగ్ బాస్ తోనే ఆటలా?