E-Paper
Advertisement

Aadi Sai Kumar: ఆదిసాయి కుమార్ తో సినిమాలు చేస్తే నష్టపోవాల్సిందేనా.. డబ్బు కోసమే సినిమాలు?

Aadi Sai Kumar: ఆదిసాయి కుమార్ తో సినిమాలు చేస్తే నష్టపోవాల్సిందేనా.. డబ్బు కోసమే సినిమాలు?
Advertisement

Aadi Sai Kumar: ఆది సాయికుమార్ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న నటుడు సాయికుమార్(Sai Kumar) వారసుడిగా ఈయన కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయికుమార్ మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆది మాత్రం సరైన విధంగా సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి. సినిమాలు సక్సెస్ కానీ నేపథ్యంలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారని భావిస్తున్న తరుణంలో శంభాల (Shambhala)సినిమా అని ప్రకటించారు.

సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ గా శంభాల..

ఉగంధర్ ముని దర్శకత్వంలో ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, స్వాసిక, రవి వర్మ వంటి తదితరులు నటించిన ఈ సినిమా సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాని క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 25వ తేదీ విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆది సాయికుమార్ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆది తన కెరియర్ గురించి, కెరియర్ పరంగా ఎదుర్కొన్న అవమానాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

విమర్శించిన వారికి శంభాల సమాధానమా?

Advertisement

ఆది సాయికుమార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ జర్నీలో ఈయన సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువగా చూశారని చెప్పాలి. అయితే ఆదితో సినిమా చేయాలనే ప్రస్తావన వస్తే నిర్మాతలు వెనుకడుగు వేసే వారిని ఆదితో సినిమా చేసిన వాళ్లంతా డబ్బులు నష్టపోవాల్సిందేనని ఎంతో మంది నిర్మాతలు తన గురించి మాట్లాడారని ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. మరి కొంతమంది అయితే డబ్బు కోసమే ఆది సినిమాలు చేస్తున్నారని కూడా మాట్లాడినట్లు ఈయన తెలిపారు.

జియో సైంటిస్ట్ గా ఆది సాయికుమార్..

Advertisement

డబ్బు కోసమే అయితే సినిమాలు చేయాల్సిన అవసరం ఆది సాయికుమార్ కు లేదని చెప్పాలి. తన తండ్రి సినిమాలలో నటిస్తూ మంచిగానే సంపాదించారు. మరి ఆది సాయికుమార్ గురించి విమర్శించిన వారందరికీ శంభాల సినిమాతో సమాధానం చెప్పబోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అది ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో ఆది సాయికుమార్ జియో-సైంటిస్ట్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కథ మొత్తం సైన్స్, అతీంద్రియ శక్తులు నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

Also Read: Dil Raju Daughter: మరో బిజినెస్ ప్రారంభించిన దిల్ రాజ్ కుమార్తె హన్షిత..చీఫ్ గెస్ట్ గా అల్లు స్నేహ రెడ్డి!

Related News

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

Big Stories

Advertisement
×