E-Paper
Advertisement

Dil Raju Daughter: మరో బిజినెస్ ప్రారంభించిన దిల్ రాజ్ కుమార్తె హన్షిత..చీఫ్ గెస్ట్ గా అల్లు స్నేహ రెడ్డి!

Dil Raju Daughter: మరో బిజినెస్ ప్రారంభించిన దిల్ రాజ్ కుమార్తె హన్షిత..చీఫ్ గెస్ట్ గా అల్లు స్నేహ రెడ్డి!
Advertisement

Dil Raju Daughter: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారందరూ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర వ్యాపారాలను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది హీరోలు రెస్టారెంట్ బిజినెస్ లతో పాటు నిర్మాతలుగా కొనసాగుతున్నారు. ఇక హీరోయిన్ అయితే జిమ్ , క్లాతింగ్ బిజినెస్, మేకప్ ప్రొడక్ట్స్, డిజైనర్ స్టూడియోస్ వంటివి ప్రారంభిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న దిల్ రాజు(Dil Raju) గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి (Hanshitha Reddy)అందరికీ సుపరిచితమే. ఈమె కూడా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ది గుడ్ సైడ్ మేకప్ స్టూడియో..

హన్షిత రెడ్డి నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇలా నిర్మాతగా కొనసాగుతున్న హన్షిత హైదరాబాద్లో మరొక బిజినెస్ ప్రారంభించారని తెలుస్తుంది. ఈమె “ది గుడ్ సైడ్” ప్రీమియర్ మేకప్ స్టూడియోను ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మేకప్ స్టూడియో ప్రారంభోత్సవంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) పాల్గొన్నారు.

అల్లు స్నేహారెడ్డి చేతుల మీదగా..

Advertisement

అల్లు స్నేహ రెడ్డి చేతుల మీదుగా హన్షిత రెడ్డి స్టూడియో ప్రారంభించారు. ఇక ఈ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అల్లు స్నేహారెడ్డి లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా హన్షిత రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ మేకప్ స్టూడియోని హన్షిత తన స్నేహితురాలు హారికతో కలిసి ప్రారంభించారు. ఇలా హన్షిత రెడ్డి ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టారు. మరి నిర్మాతగా సక్సెస్ అందుకున్న ఈమె బిజినెస్ పరంగా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్..

Advertisement

ఈ స్టూడియో ప్రారంభోత్సవంలో భాగంగా అల్లు స్నేహ రెడ్డి పాల్గొనడంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి. అల్లు స్నేహారెడ్డి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమెకు మాత్రం హీరోయిన్ ని మించిన ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను తన భర్త పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్ చేయడంతో స్నేహ రెడ్డికి హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె కూడా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఎప్పటికప్పుడు స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తూ సందడి చేస్తుంటారు. ఇక స్నేహ రెడ్డి పలు వ్యాపారాలలో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతూ ఉన్నారు.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×