E-Paper
Advertisement

Aadi SaiKumar: షూటింగ్ లో ప్రమాదానికి గురైన హీరో.. గాయాలతోనే షూటింగ్..

Aadi SaiKumar: షూటింగ్ లో ప్రమాదానికి గురైన హీరో.. గాయాలతోనే షూటింగ్..
Advertisement

Aadi Sai Kumar: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar)అర్చన అయ్యర్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం శంబాల(Shambhala). ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ కూడా రాబోతుందని తెలుస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఆది సాయికుమార్ విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సైన్స్ , అతేంద్రియ శక్తుల మధ్య కొనసాగే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

శంబాలపై భారీ అంచనాలు..

ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. సినిమా షూటింగ్ అంటే ఎంతో కష్టతరమైన విషయం అని చెప్పాలి. కొన్ని సందర్భాలలో ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా ప్రమాదాల కారణంగా ఎంతో మంది సెలెబ్రిటీలు మరణించిన విషయం తెలిసిందే . అయితే శంబాల సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుందని ఈ ప్రమాదంలో భాగంగా నటుడు ఆది సాయికుమార్ తీవ్ర గాయాలు పాలయ్యారు అంటూ తాజాగా చిత్ర బృందం వెల్లడించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాలను వెల్లడించారు.

షూటింగ్లో గాయపడిన ఆది..

Advertisement

భారీ యాక్షన్స్ సన్నివేశాలను షూట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే ఈ సన్నివేశాలను రాత్రి సమయంలో చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఆది బాగా గాయపడ్డారు అయితే తనకు గాయాలు అయినప్పటికీ షూటింగుకు ఎలాంటి అంతరాయం కలగకుండా షూటింగ్ మొత్తం పూర్తి చేసి అనంతరం హాస్పిటల్ కి వెళ్ళారని శంభాల టీం తెలిపారు. ఈ విధంగా ఆది సాయికుమార్ గాయాలు అయినప్పటికీ షూటింగ్లో పాల్గొన్నారనే విషయం తెలియడంతో ఈయన డెడికేషన్ పై అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

శంభాల పైనే ఆశలు..

Advertisement

ఇక ఆది సాయికుమార్ కెరియర్ లో ఈ సినిమా చాలా కీలకంగా మారింది .ఇటీవల వరుస ఫ్లాప్ సినిమాలతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్న ఆది సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. కచ్చితంగా అది ఈ సినిమాతో హిట్ అందుకుంటారని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సాటిలైట్ డిజిటల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిందని తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత శంబాల అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదికి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది.. ఇక ఈ సినిమా శంభాల టైటిల్ కావడంతో ఈ సినిమాకు ప్రభాస్ కల్కి సినిమాకు ఏదైనా లింకు ఉందా అని అభిమానులు కూడా సందేహాలు వ్యక్తం చేశారు కానీ అలాంటిదేమీ లేదని ఈ సినిమా పూర్తిగా విభిన్నంగా ఉండబోతుందని చిత్ర బృందం తెలియచేశారు.

Also Read: Actor Shivaji: పొలిటికల్ ఎంట్రీ పై శివాజీ కామెంట్స్.. నేనంటే భయం అంటూ!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×