Actor Shivaji: సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందని చెప్పాలి. ఎంతోమంది సినిమాలలో నటించినటులుగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది స్టార్ సెలబ్రెటీలు రాజకీయాలలో ఉన్నత పదవులను అధిరోహించారు. ఇప్పటికి కూడా పలువురు సెలబ్రిటీలు రాజకీయాలలోకి అడుగు పెట్టకపోయినా రాజకీయాల పట్ల ఎంతో ఆసక్తి చూపుతూ తరచూ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారిలో నటుడు శివాజీ కూడా ఒకరు. శివాజీ గతంలో పలు రాజకీయ పార్టీలకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాలలో మాత్రం పాల్గొనలేదు.
ఇకపోతే గత ఎన్నికలలో కచ్చితంగా శివాజీ ఎన్నికలలో పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా శివాజీ దండోరా(Dandora) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రాజకీయాలలోకి రావడం గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాజకీయాలలోకి రాబోతున్నారా అనే ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదని తెలిపారు. రాజకీయాలలో కొనసాగాలి అంటే అందరి పట్ల నిర్ధాక్షణ్యంగా ఉండాలి లేదా ఇతరుల కాళ్లు పట్టుకోవాలి ఈ రెండు నాకు చేతకావు అందుకే రాజకీయాలలోకి రానని తెలిపారు.
ఇలా తాను ఏ పార్టీలోకి రాకపోయినా ప్రభుత్వాలను మాత్రం తాను ప్రశ్నిస్తానని ఈయన తెలిపారు. ఇక గతంలో తాను రాజకీయాలలోకి వస్తాను అంటే అందరూ భయపడేవారు నేను మైక్ చేత పట్టుకొని ఏం మాట్లాడతానో అనే భయం అందరిలో ఉండేది. రాజకీయ నాయకులు తప్పు చేస్తే తప్పు అని చెప్పే స్వభావం నాది అందుకే వాళ్ళకి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో అదే రూట్ లో వెళ్లి నా అభిప్రాయాలను తెలియజేశాను . ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయని శివాజీ తెలిపారు.
కాళ్లు పట్టుకొనే స్వభావం..
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే లౌక్యంతో పాటు టాలెంట్ లక్ ఉండాలని తెలిపారు కానీ రాజకీయాలలో సక్సెస్ అవ్వాలి అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకునే స్వభావం ఉండాలి అలాగే కాళ్లు పట్టుకునే స్వభావం ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడే రాజకీయాలలోకి రావాలని నాకు ఇలాంటి స్వభావాలు లేవు అంటూ శివాజీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శివాజీ కెరియర్ విషయానికి వస్తే.. కొత్త కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివాజీ బిగ్ బాస్ అనంతరం వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక త్వరలోనే ఈయన దండోరా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 25వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో శివాజీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
Also Read: Nivetha Thomas : హీరోయిన్లకు తలనొప్పిగా మారిన ఏఐ.. నిన్న శ్రీలీల..నేడు నివేథా!