E-Paper
Advertisement

Dhurandhar 2: ధురంధర్ 2 నుంచీ “ఆరి ఆరి” టైటిల్ ట్రాక్.. బీట్స్ అదిరిపోలా?

Dhurandhar 2: ధురంధర్ 2 నుంచీ “ఆరి ఆరి” టైటిల్ ట్రాక్.. బీట్స్ అదిరిపోలా?
Advertisement

Dhurandhar 2:ధురంధర్ (Dhurandhar) .. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కేవలం ఇండియాలోనే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఏడు దేశాలలో సంచలనం సృష్టించింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ధురంధర్: ది రివేంజ్’ పేరిట సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్ , ట్రైలర్ అంచనాలు పెంచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచడానికి “ఆరి ఆరి” అంటూ టైటిల్ ట్రాక్ ను విడుదల చేశారు.

ఆరి ఆరి టైటిల్ ట్రాక్ రిలీజ్..

ఇకపోతే ఈ పాటను ఇప్పటికే ట్రైలర్ లో కాస్త వినిపించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా పూర్తి పాటను విడుదల చేయడంతో ప్రేక్షకులు నుంచి మంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్ దేవ్ కంపోజ్ చేసిన ఈ పాటను నవ్ తేజ్ సింగ్ రేహాల్, శాశ్వత్ సచ్ దేవ్, ఖాన్ సాబ్, సుధీర్, యదు వంశీ, జాస్మిన్ కలిసి సంయుక్తంగా పాడారు. ఇకపోతే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ పాట 2000 సంవత్సరంలో విడుదలైన బాంబే రాకర్స్ యొక్క పాపులర్ సాంగ్ “అరి అరి” కి రీ క్రియేటెడ్ వర్షన్ గా రూపొందించడం విశేషం

మ్యూజిక్ ట్రాక్ అదుర్స్..

Advertisement

ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాంగ్ లిరిక్స్ మ్యూజిక్ ట్రాక్ అభిమానులను మరో కొత్త లోకంలోకి తీసుకెళ్లబోతున్నాయి అనే కామెంట్లు అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అటు అభిమానులే కాదు సినీ లవర్స్ కూడా ఈ పాట త్వరలోనే చార్ట్ బస్టర్ గా మారే అవకాశాలు ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే వీడియో విషయంలో మాత్రం కొత్తగా చూపించిందేమీ లేదనే టాక్ వస్తున్నా.. సాంగ్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా సినిమా కథలోని కీలక అంశాలను ముందుగానే బయట పెట్టకుండా.. కొత్త సీన్లు చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు . మరి ప్రేక్షకులు మాత్రం ఈ పాటలో ఏదో కొత్త ఫుటేజ్ ఉంటుందని ఆశించారు కానీ వారికి నిరాశ మిగిలిందనే చెప్పాలి . ఏది ఏమైనా తాజాగా విడుదల చేసిన ఈ ఆరి ఆరి సాంగ్ ఇప్పుడు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.

also read:Shanmukh Jaswant: షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య వైష్ణవి రియాక్షన్!

సినిమా విశేషాలు..

Advertisement

ఆదిత్యధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా ఈ సినిమా రాబోతోంది. ఇందులో ప్రముఖ హీరోయిన్ యామి గౌతమ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఈమె కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక భారీ అంచనాల మధ్య మార్చి 19న రాబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అరుదైన రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×