E-Paper
Advertisement

Bank Account Safety Tips: ఈ టిప్స్ పాటిస్తే.. మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు సేఫ్!

Bank Account Safety Tips: ఈ టిప్స్ పాటిస్తే.. మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు సేఫ్!
Advertisement

Bank Account Safety Tips: దేశంలో డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అంతే స్పీడ్ లో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఎంత తెలిసినా.. ఒక చిన్న అజాగ్రత్త మన బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తుంది. ఆన్ లైన్ మోసాలను అడ్డుకోవాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు. తెలియని వ్యక్తులకు OTPలు, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్‌ల వంటి సున్నితమైన సమాచారాన్ని చెప్పడం, తెలియని లింక్ లపై క్లిక్ చేయడం వల్ల ఎక్కువగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు మీ డేటాతో డబ్బు కొట్టేయడం లేదా అక్రమ లావాదేవీల కోసం మీ బ్యాంకు ఖాతాలను వాడుకోవడం చేస్తుంటారు. ప్రస్తుతం మన ఆర్థిక లావాదేవీలు డిజిటల్ మోడ్ కు మారిపోవడంతో.. సైబర్ క్రైమ్ కూడా పెరుగుతుందని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు.

బ్యాంక్ అకౌంట్ సేఫ్టీ టిప్స్

బ్యాంక్ అకౌంట్లను సేఫ్ గా ఉంచుకోవడానికి ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి స్ట్రాంగ్ పాస్ వర్డ్. మీ పేరు, పుట్టిన తేదీ, వరుస నెంబర్లు, మీ ఫోన్ నెంబర్ ఇలా.. సింపుల్ గా పాస్ వర్డ్ పెట్టుకోవడం సేఫ్ కాదని ఎక్స్ ఫర్ట్స్ సూచిస్తున్నారు. పాస్ వర్డ్ లో డిఫరెంట్ కాంబినేషన్, టు స్టెప్ అథెంటికేషన్ ఉండేలా పెట్టుకోవాలి. తరచుగా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, పేమెంట్స్ హిస్టరీని చెక్ చేస్తూ ఉండాలి.

ఆ లింక్ పై క్లిక్ చేస్తే

Advertisement

రివార్డులు, ఖాతా అప్డేట్, లాటరీ గెలుచుకున్నట్లు వచ్చే లింక్‌లు, ఈ-మెయిల్‌లు లేదా మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మోసగాళ్లు సాధారణంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల్లాగా నటిస్తూ ఫోన్ చేస్తుంటారు. మీ వ్యక్తిగత వివరాలను చెప్పాలని ఒత్తిడి చేస్తుంటారు. బ్యాంకు సిబ్బంది ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ ల ద్వారా పాస్‌వర్డ్‌లు, OTPలు లేదా కార్డుల వివరాలను ఎప్పుడూ అడగరని గుర్తు పెట్టుకోండి. ఎక్కువ సేపు ఆన్ లైన్ లో ఉండే Gen-Z ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారని నిపుణులు అంటున్నారు. Gen-Z సోషల్ మీడియా లేదా యాప్స్ లో ఎక్కువగా స్క్రోల్ చేస్తున్నప్పుడు.. బ్యాంక్ నుంచి పంపినట్లు మోసపూరిత మెసేజ్ లను వస్తుంటాయి. ఇలాంటి మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:  , విలువైన వస్తువులు బ్యాంక్‌లో పెడుతున్నారా? బ్యాంక్ లాకర్లు పూర్తిగా సురక్షితం కాదు.. ఎందుకంటే

స్మార్ట్ ఫోన్ లో అసలు సంగతి?

Advertisement

ఇప్పుడిప్పుడే స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిని సైబర్ నేరగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. పాత తరం వారికి ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్ లైన్ లావాదేవీలపై కాస్త అవగాహన తక్కువ. దీంతో వీరికి చట్టబద్ధమైన బ్యాంకింగ్ కమ్యూనికేషన్, మోసాల మధ్య తేడాను గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఈ విషయాలు తెలిసిన వారు ఇంట్లోని పెద్ద వారికి ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించాలి. అనుమానాస్పద లింక్ లు, కాల్స్ కు స్పందించవద్దని సూచించాలి. అలాగే ఆన్ లైన్ చెల్లింపులకు పబ్లిక్ Wi-Fi వాడొద్దని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు. బ్యాంకింగ్ వివరాలను పక్కవారితో పంచుకోవద్దని సూచిస్తున్నారు.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×