E-Paper
Advertisement

Allu Arjun: జపాన్ లో అడుగుపెట్టిన పుష్పరాజ్..ఇక రప్పా రప్పానే!

Allu Arjun: జపాన్ లో అడుగుపెట్టిన పుష్పరాజ్..ఇక రప్పా రప్పానే!
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ప్రస్తుతం జపాన్ (Japan)పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి జపాన్  అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి జపాన్లో అడుగుపెట్టడంతో అక్కడ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పుష్ప సినిమాకు సంబంధించిన పోస్టర్లతో అల్లు అర్జున్ కు ఘన స్వాగతం లభించింది. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప 2 సినిమా జనవరి 16వ తేదీ జపాన్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

పుష్ప కున్రిన్‌..

ఈ సినిమా జపాన్ లో “పుష్ప కున్రిన్‌”(Pushpa kunrin) గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి జపాన్ చేరుకున్నారు. ప్రస్తుతం ఈయన జపాన్ లోని టోక్యో నగరంలో ఉన్నారు. ఇక టోక్యో నగరంలోకి అడుగుపెట్టగానే అక్కడి అభిమానులతో బన్నీ ముచ్చటించారు. ఇక ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దర్శకుడు సుకుమార్ (Sukumar) తో పాటు నటి రష్మిక మందన్న (Rashmika Mandanna)కూడా జపాన్ వెళ్ళబోతున్నారని తెలుస్తోంది.. 2024 డిసెంబర్లో విడుదలైన పుష్ప 2 సినిమా సుమారు 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే జపాన్ లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుండడంతో అక్కడ కూడా అదే సక్సెస్ అందుకోవాలని బన్నీ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

జనవరి 16న పుష్ప రిలీజ్..

Advertisement

మరి జపాన్ లో పుష్ప రాజ్ హవా ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా జపాన్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.. ఈ సినిమా 16వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో వారం రోజులపాటు అల్లు అర్జున్ జపాన్లోనే పర్యటించబోతున్నారని సమాచారం. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్ అభిమానులను కూడా కలవనున్నారని తెలుస్తోంది.

లోకేష్ కనగరాజ్ తో బన్నీ..

Advertisement

ఇక అల్లు అర్జున్ సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం షూటింగ్ పనులలో బిజీగా ఉంది. ఈ సినిమా 2027 లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ తదుపరి సినిమాలపై కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారించారు త్వరలోనే తన తదుపరి సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఈయన మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకి  సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.

Also Read: The Raja Saab 4 Days Collections: భారీగా పడిపోయిన రాజాసాబ్ కలెక్షన్స్.. డార్లింగ్ ఫాన్స్ కు నిరాశే!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×