E-Paper
Advertisement

The Raja Saab 4 Days Collections: భారీగా పడిపోయిన రాజాసాబ్ కలెక్షన్స్.. డార్లింగ్ ఫాన్స్ కు నిరాశే!

The Raja Saab 4 Days Collections: భారీగా పడిపోయిన రాజాసాబ్ కలెక్షన్స్.. డార్లింగ్ ఫాన్స్ కు నిరాశే!
Advertisement

The Raja Saab 4 Days Collections: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమా అంటేనే సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉంటాయి. ప్రభాస్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన 100 కోట్ల కలెక్షన్లను రాబడుతుందన్న ధీమా ప్రతి ఒక్కరిలోను ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన మారుతి డైరెక్షన్లో నటించిన ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది.

హర్రర్ కామెడీ నేపథ్యంలో..

దాదాపు 15 ఏళ్ల తర్వాత మంచి ఎంటర్టైనర్ ద్వారా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే కలెక్షన్ల పై కూడా భారీ ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నాలుగు రోజులు అవుతున్న కేవలం 200 కోట్ల కలెక్షన్లను రాబట్టడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పటిలాగే 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన తదుపరి అనుకున్న స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాబట్టలేక పోతోంది.

సంక్రాంతి సినిమాల ప్రభావం..

Advertisement

తాజాగా నాలుగు రోజుల కలెక్షన్లకు సంబంధించి నిర్మాతలు పోస్టర్ విడుదల చేశారు నాలుగు రోజులకు గాను ప్రభాస్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 201 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను జోడించిన అనంతరం ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం గమనార్హం. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ పండుగను పురస్కరించుకొని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి వరుస సినిమాలు విడుదల అవుతున్నాయి. తాజాగా విడుదలైన మన శంకర్ వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలకు కూడా మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ ప్రభావం రాజా సాబ్ కలెక్షన్ల పై కూడా పడిందని చెప్పాలి.

కొత్త ఏడాదిలో నిరాశ..

Advertisement

ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రభాస్ అభిమానులకు మారుతి నిరాశ మాత్రమే మిగిల్చారని తెలుస్తోంది. కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ తన సినిమాతో ప్రేక్షకులను నేర్పించలేకపోయారు. ఇక ఈ సినిమాలో ఈయనకు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదల కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు ప్రస్తుతం ఈయన హనురాగవపూడి సినిమాతో పాటు సందీప్ రెడ్డి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది విడుదల కాబోతున్నాయని తెలుస్తోంది.

Also Read: AOR Pre release: ఆ ఇద్దరు హీరోయిన్లతో చేయడం నా డ్రీమ్ : నవీన్ పోలిశెట్టి

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×