E-Paper
Advertisement

Actor Govinda:మృతి అంటూ ఫేక్ న్యూస్.. గోవిందా ఫస్ట్ రియాక్షన్.. ఏం అన్నాడంటే?

Actor Govinda:మృతి అంటూ ఫేక్ న్యూస్.. గోవిందా ఫస్ట్ రియాక్షన్.. ఏం అన్నాడంటే?
Advertisement

Actor Govinda: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు ఇటీవల కాలంలో వరుసగా అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్ పాలవ్వడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ధర్మేంద్ర(Dharmendra) అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్ కి వెళ్లడంతో ఏకంగా ఆయన చనిపోయారంటూ వార్తలు బయటకు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఈ వార్తలను ఖండిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ధర్మేంద్ర ఘటన మరిచిపోక ముందే మరో నటుడు గోవిందా (61) (Govinda)సైతం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆయనని కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు.

క్రిటికేర్ హాస్పిటల్లో నటుడు గోవిందా…

ఇలా స్పృహ లేకుండా కుప్పకూలిపోయిన ఈయనని హాస్పిటల్ కి తరలించడంతో నటుడు గోవింద కూడా మరణించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆయన బృందం ఖండించారు. గత అర్ధరాత్రి సమయంలో గోవింద ఉన్న ఫలంగా తన ఇంట్లో కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే తనని జుహులోని క్రిటికేర్ఆసుపత్రికి(Criti Care Hospital) తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో నటుడు గోవిందకు పలు పరీక్షలను నిర్వహించడంతో ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త కుదట పడింది.

వర్కౌట్స్ కారణంగానే ఇలా జరిగిందా..

Advertisement

ఈ విధంగా గోవిందా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు వెల్లడించడంతో అభిమానులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈయన ఆరోగ్యం నిలకడగా ఉన్న నేపథ్యంలో నేడు మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. ఇలా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈయన మీడియా సమావేశంలో పాల్గొని తన అనారోగ్య సమస్యల గురించి వివరణ ఇచ్చారు.” నేను బాగానే ఉన్నాను. వర్కౌట్ అధికంగా చేయటం వల్ల అలసిపోయానని, ఇలా వర్క్ అవుట్ లు చేయడం కంటే యోగ ప్రాణాయామం వంటివి ఆరోగ్యానికి చాలా మంచిదని” ఈయన సలహాలు కూడా ఇచ్చారు. ఇలా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన సమయంలో గోవింద చాలా యాక్టివ్ గా కనిపించిన నేపథ్యంలో అభిమానులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

?igsh=MWZkaXY5Z3NqdXVwaw%3D%3D

Advertisement

ఇకపోతే బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో అడ్మిట్ కావడంతో సోమవారం తనని పరామర్శించడానికి స్వయంగా గోవిందా హాస్పిటల్ కి వెళ్లారు. అయితే ధర్మేంద్ర క్షేమంగా ఇంటికి డిస్చార్జ్ కావటం, స్పృహ కోల్పోయి గోవింద హాస్పిటల్ కి వెళ్లడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గత ఏడాది గోవిందా తన లైసెన్స్ రివాల్వర్ పేలడంతో కాలికి గాయం అయ్యి హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈయన కెరియర్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ సక్సెస్ అందుకున్న గోవిందా చివరిగా 2019 లో రంగీలా రాజా అనే సినిమాలో కనిపించి సందడి చేశారు. ఈ సినిమా అనంతరం ఈయన ఫిట్నెస్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇలా శృతిమించి వర్క్ అవుట్ చేయడం వల్లే గోవిందా స్పృహ కోల్పోయి హాస్పిటల్ పాలయ్యారని తెలుస్తోంది.

Also Read: Prakash Raj on Betting Apps: తప్పు చేశాను… తెలియక చేసినా.. తప్పు తప్పే

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×