E-Paper
Advertisement

SHAMI-BCCI: షమీవి అన్ని దొంగ నాటకాలే.. మాతో గేమ్స్ ఆడుతున్నాడు.. బీసీసీఐ సీరియస్

SHAMI-BCCI: షమీవి అన్ని దొంగ నాటకాలే.. మాతో గేమ్స్ ఆడుతున్నాడు.. బీసీసీఐ సీరియస్
Advertisement

SHAMI-BCCI: భారత క్రికెట్ జట్టుకు ఎన్నో గొప్ప విజయాలను అందించిన స్పీడ్ స్టార్ మహమ్మద్ షమీ {Mohammed Shami} అంతర్జాతీయ కెరీర్ తుదిదశకు చేరుకుందా..? జాతీయ జట్టులోకి అతడి రీఎంట్రీ అసాధ్యమేనా..? టి-20 జట్టు లెక్కల్లో ఎప్పుడో స్థానం కోల్పోయిన షమీ.. ఇప్పుడు టెస్ట్, వన్డే ఫార్మాట్ లలో కూడా రిఎంట్రీ చేయడం అసాధ్యమేనా..? అంటే ప్రస్తుత పరిణామాలు, బీసీసీఐ {BCCI} వర్గాల ఆలోచన విధానం చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.

Also Read: Uppal Stadium Dressing Room: SRH డ్రెస్సింగ్ రూమ్ చూశారా..? ఉప్పల్ స్టేడియంలో లగ్జరీ ఏర్పాట్లు.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Advertisement

2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో చీలమండ గాయానికి గురైన మహమ్మద్ షమీ.. ఆ తర్వాత చాలాకాలం ఆటకు దూరమయ్యాడు. సర్జరీ తర్వాత కోలుకోవడానికి ఎక్కువగా సమయం పట్టింది. చివరగా ఈ మార్చ్ లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన 35 ఏళ్ల షమీ.. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో రాణిస్తున్నాడు.

సెలక్టర్లు పట్టించుకోవడం లేదు:

తనని సెలక్టర్లు పట్టించుకోవడంలేదని, కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని మహమ్మద్ షమీ ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. రంజీల్లో ఆడేవాడిని.. వన్డేల్లో ఆడలేనా..? అని ప్రశ్నించాడు. తాను ఫిట్ గా ఉన్నానని.. ఒకవేళ ఫిట్నెస్ సమస్య ఉంటే రంజీ ట్రోఫీలో ఆడే వాడిని కాదన్నాడు. తన ఫిట్నెస్ గురించి సెలెక్టర్లకు అప్డేట్ ఇచ్చే పని తనది కాదన్నాడు షమీ. ఇక ప్రస్తుతం రంజీల్లో వరుసగా మూడు మ్యాచ్ లు ఆడి.. రైల్వేస్ తో జరుగుతున్న పోరుకు దూరంగా ఉన్నాడు. ఈ నెల 16 నుంచి అస్సాంతో జరిగే మ్యాచ్ లో షమీ తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ తరువాత సయ్యద్ ముస్తఫ్ అలీ టీ-20 టోర్నమెంట్ లో ఆడి.. డిసెంబర్ లో జరిగే ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నాడు.

షమీపై బిసిసిఐ సీరియస్:

Advertisement

తనను కావాలనే సెలెక్ట్ చేయడం లేదని మహమ్మద్ షమీ చేసిన ఆరోపణలను బీసీసీఐ అఫీషియల్ గా ఖండించినట్లు పిటిఐ పేర్కొంది. తనను టెస్ట్ జట్టులో ఎంపిక చేయకపోవడంపై సెలెక్టర్లు, మేనేజ్మెంట్లతో సరైన కమ్యూనికేషన్ లేకపోవడమేనని షమీ చేసిన ఆరోపణలను ఖండించింది బీసీసీఐ. ” షమీ ఫిట్నెస్ పై తరచూ వాకబు చేస్తూనే ఉన్నాం. అతడిని ఇంగ్లాండ్ సిరీస్ కి పంపించేందుకు ప్రయత్నించాం.

Also Read: Abhishek Sharma Tattoo: అభిషేక్‌ శర్మ కొత్త టాటూ.. 10 గంటల్లోనే దాదాపు లక్ష లైక్‌లు

ఇంగ్లాండ్ తో జరిగిన ఇండియా-ఏ మ్యాచ్ లలో ఆడమని అడిగాం. కానీ షమీ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా నిరాకరించాడు. అతడిని బరిలోకి దింపితే ఫిట్నెస్ పై అంచనా వస్తుందని అనుకున్నాం. కానీ తాను సిద్ధం అయ్యేందుకు షమీ తగిన సమయం కావాలని కోరాడు. అతడిని సంప్రదించలేదన్నది పూర్తిగా అవాస్తవం. కమ్యూనికేషన్ లేదన్న మాట పూర్తిగా నిజం కాదు” అని బీసీసీఐ స్పష్టం చేసింది.

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×