Tollywood: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఒకవైపు అద్భుతమైన నటనను కనబరుస్తూనే.. పాత్రలకు ప్రాణం పోస్తూ మంచి పేరు మోసిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరియర్ పరంగా ఎంత ఎత్తుకైతే ఎదుగుతున్నారో.. అదే కెరియర్లో ఎన్నో కాంట్రవర్సీలు కూడా ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇటీవల హిందూ మతాన్ని, హిందూ దేవుళ్లను హేళన చేస్తూ మాట్లాడిన మాటలు ఈయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వివరణ ఇచ్చినా సరే కరాటే కళ్యాణి లాంటి సినీ నటులు ఈయనపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టాలని కోరుతూ ఫిర్యాదులు కూడా అందజేశారు. అయితే ఇప్పుడు ఈయనపై ప్రముఖ నటుడు నాగ మహేష్ (Naga Mahesh) చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతున్నాయి. ఒక అద్భుతమైన నటుడిగా ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఒక వ్యక్తి.. తన మేధో వైకల్యంతో కోట్లాదిమంది ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని , సనాతన ధర్మాన్ని కించపరచడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగ మహేష్ మాట్లాడుతూ..” వెండితెరపై నవరసాలను పండించడంలో ప్రకాష్ రాజ్ (Prakash Raj)దిట్ట. కానీ నిజజీవితంలో మాత్రం విద్వేషం అనే రసాన్ని మాత్రమే ఆయన తనలో నింపుకున్నట్టు అనిపిస్తోంది. ఇటీవల ఆయన హిందూ ధర్మంపై, రామాయణం పై చేసిన వ్యాఖ్యలు ఆయనలోని సంస్కారహీనుడిని బయటపెడుతున్నాయి. అసలు ప్రకాష్ రాజ్ ఎవరిని ద్వేషిస్తున్నారు? వ్యక్తులనా లేక రాజకీయ పార్టీలనా? లేక ఒక మతాన్ని ఆయన లక్ష్యంగా చేసుకున్నారా ? ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అంటే ఆయనకు ఉన్న వ్యతిరేకత.. వ్యక్తిగత ద్వేషంగా మారిపోయింది. నిత్యం జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ వంటి నేతలను ప్రశ్నించే ప్రకాష్ రాజ్ ఆ ప్రశ్నల్లో ఉన్న తర్కం కంటే వెటకారాన్ని ఎక్కువగా నింపుతున్నారు” అంటూ మండిపడ్డారు నాగమహేష్.
also read:Tollywood Producer: సినీ ఇండస్ట్రీలో విషాదం.. నిర్మాత చిట్టిబాబు మృతి.. కారణం అదే..!
నాస్తికుడిగా చెప్పుకునే ప్రకాష్ రాజ్ తన తల్లి నమ్మకాన్ని గౌరవిస్తూ చర్చిలో ప్రార్థనలు చేసినప్పుడు అందరు ఈయనను సంస్కారవంతుడు అంటూ పొగిడారు. అయితే సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్న వారిని చూసి ఓర్వలేక.. దేవుళ్ళనే హేళన చేసే స్థాయికి దిగజారడం నిజంగా విచారకరం. ముఖ్యంగా కోట్లాదిమంది హిందువుల నమ్మకమైన శ్రీరాముడిని అవహేళన చేసినప్పుడు ఆయనలోని సంకుచిత బుద్ధి బయటపడింది.వాస్తవానికి నాస్తికత్వం అంటే దేవుడిని నమ్మకపోవడమే.. కానీ ఒకరి నమ్మకాన్ని కించపరచడం కాదు. ప్రకాష్ రాజ్ చేస్తున్నది ఒక అచ్చమైన హిందూ దేశం. అది నాస్తికవాదం కాదు. రామాయణాన్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రకాష్ రాజ్ కూడా తన వినాశనానికి తానే అంకురార్పణ చేసుకుంటున్నాడు అంటూ నాగమహేష్ హెచ్చరించారు. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలను ఎండగడుతూ నాగ మహేష్ తన ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరచడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటికే ఒకసారి స్పందించిన ప్రకాష్ రాజ్ మళ్లీ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తారేమో చూడాలి.