Mega Movie: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆయన సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతోమంది హీరోలకు ఆదర్శంగా నిలిచారు. వయసు పెరుగుతున్న సరే సినిమాలో చేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు చిరంజీవి. ఈ వయసులో కూడా ఆయన నటించే సినిమాలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం మరో రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ కమ్ములు ఓ మూవీ రాబోతుంది అంటూ ఫిలింనగర్ లో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం అయితే ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..
మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ కాంబోలో గతంలో ఓ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఫుల్ లెన్త్ మూవీ అంటే ఆచార్య అనే చెప్పాలి. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో ఈ కాంబో సెట్ అవ్వదు అని అందరూ అనుకున్నారు. కానీ ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం ఈ కాంబోలో మరో సినిమా చేయబోతున్నాను అంటూ ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ ఈ కాంబోలో మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.. జైలర్ 2 మూవీతో భారీ ప్రభంజనాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబో కోసం బ్యాగ్రౌండ్ వర్క్ చేస్తున్నాడని టాక్.. మరి ఈ మూవీ పై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. భారీ విజువల్ ఎఫెక్ట్తో రాబోతున్న ఈ మూవీ కోసం మెగా ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. దీని తర్వాత మరో చిత్రంలో నటించబోతున్నాడని తెలుస్తుంది.. అటు రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నాడు.. ఈ మూవీ భారీ అంచనాలతో రాబోతుంది.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు అయిన తర్వాత నెల్సన్ తో మూవీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఈ వార్త కనుక నిజమైతే మెగా హీరోలా అకౌంట్ లో పాన్ ఇండియా చిత్రం పడిపోయినట్లే.. మెగా ఫాన్స్ కూడా ఈ కాంబోలో మరో సినిమా చూడాలని కోరుకుంటున్నారు.. మరి వాళ్ల కోరికను హీరోలు తీరుస్తారో లేదో చూడాలి…