E-Paper
Advertisement

Tollywood Hit Movies : టాలీవుడ్ లో చిన్న సినిమాల హవా.. స్టార్స్ లేకున్నా సూపర్ హిట్..

Tollywood Hit Movies : టాలీవుడ్ లో చిన్న సినిమాల హవా.. స్టార్స్ లేకున్నా సూపర్ హిట్..
Advertisement

Tollywood Hit Movies : ఒకప్పుడు స్టార్ హీరోలు సినిమాలు వస్తున్నాయి అంటే ఆ సినిమాల కోసం జనాలు ఎంతగానో వెయిట్ చేసేవాళ్ళు. అలాగే ఆ హీరోల అభిమానులు చేసే హంగామాలు అంతా ఇంతా కాదు. గత రెండు మూడేళ్లుగా స్టార్ హీరోల సినిమాల రిజల్ట్ దారుణంగా ఉండడంతో ఎక్కువమంది చిన్న సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల వచ్చిన చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. దాంతో గత రెండేళ్లుగా చిన్న సినిమాల హవా టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఎటువంటి స్టార్స్ లేకపోయినా సరే సూపర్ హిట్ అవుతున్నాయి. ఎలాంటి భారీ అంచనాలను క్రియేట్ చేసుకోకుండా థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలేవో ఒకసారి చూసేద్దాం…

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది మొదటినుంచి పెద్ద స్టార్స్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా బాగానే సందడి చేశాయి. కానీ స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. చిన్న సినిమాలు మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక ఆలస్యం ఎందుకు.. చిన్న సినిమాలు ఏవో ఓ లుక్ వేసుకోండి..

కోర్ట్ మూవీ..

Advertisement

బలగం ఫేమ్ ప్రియదర్శన్ నటించిన మూవీ కోర్ట్.. హీరో నాని ఈ సినిమాని నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హర్ష రోషన్ శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమాకు రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు. ఈ ఏడాది మార్చి 14న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది.

8 వసంతాలు..

అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘8 వసంతాలు’..ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.. ఈ మూవీ కలెక్షన్లు కూడా భారీగానే వసూల్ అయ్యాయి.. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది.

లిటిల్ హార్ట్స్…

Advertisement

మౌళి తనుజ్, శివాని నగరం జంటగా తెరకెక్కిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆదిత్య హాసన్ నిర్మాణంలో సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.. అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 50 కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడం మామూలు విషయం కాదు..

మ్యాడ్ స్క్వేర్…

గతంలో వచ్చిన మాట్ సినిమాకి సీక్వల్ గా ఈ సినిమా వచ్చింది. చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఏడాది ఉగాది కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది. సినిమా కంటే ఈ సినిమాకు టాక్ పాజిటివ్ గా రావడంతో కలెక్షన్లు భారీగా పెరిగాయి.

రాజు వెడ్స్ రాంబాయి.. 

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజ‌యం సాధించిన చిత్రం “రాజు వెడ్స్ రాంబాయి” . బాక్స్ ఆఫీస్ వద్ద సభారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం విడుదలైన తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ హిట్ టాక్ ని అందుకుంది.. సినిమాకు పెట్టిన ఖర్చు కన్నా ఎక్కువగా రాబట్టింది.. ప్రస్తుతం ఓటీటీలో భారీ వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్లో ఉంది.

Also Read : నేడు మహిళ కమీషన్ ముందు హాజరుకానున్న నటుడు శివాజీ..

ఇవే కాదు మరికొన్ని చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. అయితే ఈ ఏడాదిలో స్టార్ హీరోలు సినిమాలు పెద్దగా రిలీజ్ అవ్వలేదు కానీ రిలీజ్ అయిన కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. వచ్చే ఏడాది అయినా స్టార్ హీరోలకు కలిసి వస్తుందేమో చూడాలి..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×