Sivaji : టాలీవుడ్ నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇప్పుడు హీరోగా వరుసగా సినిమాలు చేసే తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.. ప్రస్తుతం ఈయన సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన నటించిన దండోరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.. మహిళల వస్త్రధారణ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.. కొందరు సెలబ్రిటీలు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఆయనను సపోర్ట్ చేస్తున్నాడు. శివాజీ ఈ వాఖ్యలను వెనక్కి తీసుకుంటు క్షమాపణలు చెప్పారు. అయిన కూడా ఆయనను టార్గెట్ చెయ్యడం ఆపలేదు.. అంతేకాదు ఆయన వ్యాఖ్యల పై మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందే. మహిళ కమీషన్ నుంచి నోటీసులు కూడా అందాయి.. దాంతో ఇవాళ నటుడు శివాజీ మహిళా కమీషన్ ముందు హాజరు కానున్నట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి..
శివాజీ మహిళలను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. వస్త్రధారణ పై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయన మెడకు ఉచ్చు బిగుసుకొనేలా చేశాయి.. దండోరా సినిమా ప్రమోషన్‌లో భాగంగా వేదికపై శివాజీ అనుచిత వాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. చేసిన వ్యాఖ్యలపై తప్పుపడుతూ కొంత సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. అలాగే అలా మాట్లాడం తప్పు అని మహిళ కమిషన్ శివాజీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది.. ఇవాళ మహిళా కమిషన్ ఎదుట శివాజీ హాజరుకానున్నట్లు సమాచారం. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇస్తారు అన్నది ఉత్కంఠ గా మారింది. అయితే ఇప్పటికే శివాజీకి సపోర్టుగా చాలామంది నిలిచారు.. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో పాటుగా జనాల్లో కూడా ఆయనకు మద్దతు లభిస్తుంది.. ఆయన ఇచ్చే వివరణ ఎలా ఉండబోతుందో మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..
Also Read : నర్మదకు ప్రేమ దూరం.. రామరాజు మాటతో ప్రేమ కన్నీళ్లు.. నిజం చెప్పేసిన వేదవతి..
గత కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన కోర్టు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై వివరణ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి మహిళల వస్త్రధారణ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి వివాదాలకు కేరాఫ్ గా మారాయి.. ఆయన ఈ వ్యాఖ్యలు నువ్వు వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెప్పిన సరే ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.. అయితే తన వ్యాఖ్యల్లో దొర్లిన రెండు అసభ్య పదాలకు మాత్రమే సారీ చెబుతూనే… స్టేట్మెంట్స్ మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు అన్నట్టు ఇన్ డైరెక్ట్ ఆయన అన్నారు. మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన సరే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆయనపై ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. కేవలం కొందరు సెలబ్రిటీలు మాత్రమే ఆయన మాటలను వ్యతిరేకించారు.. మరి ఇవాళ మహిళా కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.. అక్కడ ఏం మాట్లాడుతారో అన్నది సస్పెన్స్ గా మారింది..