E-Paper
Advertisement

Nandamuri Kalyan Chakravarthy: 39 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ.. ఇన్నేళ్లు కళ్యాణ్ చక్రవర్తి ఏం చేశాడంటే..?

Nandamuri Kalyan Chakravarthy: 39 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ.. ఇన్నేళ్లు కళ్యాణ్ చక్రవర్తి ఏం చేశాడంటే..?
Advertisement

Nandamuri Kalyan Chakravarthy: నందమూరి కుటుంబం నుంచి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఒకరు. ఈయన స్వయనా సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు కొడుకు.  ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కుమారులిద్దరూ కూడా సినిమాల్లో నటించారు. పెద్ద కొడుకు కళ్యాణ్‌ చక్రవర్తి.. ఈయన గతంలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులు నటుడుగా చెరగని ముద్ర వేసుకున్నాడు. అప్పట్లో ఈయన సినిమాలకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అలాంటి ఆయన దాదాపు 39 ఏళ్ల పాటు సినిమాలకు దూరం కావడానికి కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చినీయంశంగా మారింది.. ఇన్నేళ్లు ఆయన ఏం చేశారు? ఎందుకు మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం…

39 ఏళ్లు ఇండస్ట్రీకి అందుకే దూరం..?

నందమూరి కళ్యాణ చక్రవర్తి, 1974లో ‘మనుషుల్లో దేవుడు’ సినిమాలో బాలనటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 1976లో ‘అత్తగారు స్వాగతం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ పైన ‘తలంబ్రాలు, మామా కోడలు సవాల్, ఇంటిదొంగ, మారణ హోమం వంటి దాదాపు 12 సినిమాలను చేశాడు. ఆ చిత్రాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చెన్నైలోనే తన వ్యాపారాలను చూసుకునేందుకు వెళ్లారు. తన బిజినెస్ లతో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు స్వస్తి చెప్పేసారు. దాదాపు 39 ఏళ్ల వరకు ఆయన ఎటువంటి సినిమాల్లో నటించలేదు. రీసెంట్ గా వచ్చిన రోషన్ హీరోగా నటించిన సినిమా ఛాంపియన్ లో కనిపించారు. ఆ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో ఈయన గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.. ప్రస్తుతం ఈయన పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సినిమాలకు దూరంగా ఉన్న కారణాలని వివరించారు..

Advertisement

Also Read :చక్రి మాట మహా వింటుందా..? భూషణ్ కు మహా షాక్.. ఇంట్లో పెద్ద రచ్చ చేసిన భూషణ్..

ఇష్టం లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. 

రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్న నందమూరి కళ్యాణ్ తన సినిమా కెరియర్ ఎలా మొదలైంది అన్న విషయాన్ని పంచుకున్నారు. నందమూరి ఫ్యామిలీ లోని అందరూ హీరోలు కూడా సినిమా అంటే ఒక ఫ్యాషన్ గా భావించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. కానీ కళ్యాణ్ చక్రవర్తి మాత్రం అయస్టంగానే ఇంట్లో వాళ్ళ మాట కాదనలేక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు.. కొన్నేళ్లపాటు ఇష్టం లేకుండానే సినిమాలు చేశాను. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ లు కూడా చేసినట్లు ఆయన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతోనే వ్యాపారాలను పెంచుకునేందుకు సినిమాలకు దూరమైనట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు.. ఇన్నాళ్లకు రీయంట్రీ ఇచ్చిన కళ్యాణ్ చక్రవర్తి ఇకమీదట సినిమాల్లో కొనసాగుతారా? మళ్లీ తన వ్యాపారాలు చూసుకునేందుకు సినిమాలకు గుడ్ బై చెప్తారా అన్నది చూడాలి.

Advertisement

 

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×