E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రి మాట మహా వింటుందా..? భూషణ్ కు మహా షాక్.. ఇంట్లో పెద్ద రచ్చ చేసిన భూషణ్..

Podarillu Today Episode : చక్రి మాట మహా వింటుందా..? భూషణ్ కు మహా షాక్.. ఇంట్లో పెద్ద రచ్చ చేసిన భూషణ్..
Advertisement

Podarillu Today Episode January 2nd: కేవలం మూడు రోజులనే పెళ్లి అని మహా కి చెప్పడంతో మహా షాక్ ఐపోతుంది. చక్రి దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి అడుగుతుంది. అయితే చక్రి మాత్రం అప్పుడు పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు పెళ్లికూతురు మీరు వెళ్లిపోండి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటాడు. ఏమో నాకు కంగారుగా ఉందని మహా వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం మహా లేవగానే కింద పెళ్లి పనులు మొదలైపోతాయి. దాన్ని చూసి మహా భయపడిపోతుంది. చక్రి ఎలాగైనా సరే మహా ముఖంలో సంతోషం నింపాలి అని అనుకుంటాడు.. మహాలక్ష్మి బాధను ఎలాగైనా సరే పోగొట్టాలి అని చక్రి అనుకుంటాడు.. ఇంట్లోని వాళ్ళందరూ కలిసి తను రెడీ చేసి కిందకు తీసుకొని వస్తారు. మహాను చీరలో చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. చీరలో నిజంగానే మన మహాలక్ష్మి మహాలక్ష్మి లా ఉంది అని లలితా పొగిడేస్తుంది.. మహా ఈ పెళ్లి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటుంది.. ఇక ప్రాజెక్టు ఓకే అయినా కూడా పెళ్లి వల్ల చేసుకోలేను అని అనుకుంటుంది.. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రి కి ఫోన్ చేస్తే చక్రి ఆ పెళ్లి ఎవరు ఆపుతున్నారు అని తెలుసుకొని పెళ్లి చేసేస్తున్నారు అని అంటాడు. పెళ్ళికొడుకు కిడ్నాప్ అయినట్టు పెళ్లికూతురు కూడా వెళ్ళిపోతే బాగుంటుంది అని వాళ్ళు అంటారు. ఇక రాత్రి చక్రికి భోజనం పెట్టడానికి మహా వస్తుంది. మహా బాధపడుతూ ఉంటే చక్రి చూడలేక పోతాడు.. మీరు ధైర్యం చేసే ఇంట్లోంచి వెళ్లిపోవాలి. మీ డ్రీమ్ ని మీరు సాధించాలి అంటే కచ్చితంగా ఇలా చేయాల్సిందే అని అంటాడు.. ఆ మాటను మహా ఆలోచిస్తుంది… అయినా అతని చెప్పింది ఏం బాగోలేదు నా పెళ్లి ని తప్పించుకోవడం కోసం నేను వెళ్ళిపోతే మా నాన్న పరువు ఏమైపోతుంది అని ఆలోచిస్తుంది.. ఇక ఈ పెళ్లి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకుంటుంది. మహా భూషణ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా పడుకుంటుంది..

Advertisement

వీడిపోన్ నేను అస్సలు లిఫ్ట్ చేయను అని అనుకుంటుంది.. మహా కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అని హారికకు భూషణ్ ఫోన్ చేస్తాడు. హారిక ఫోన్ తీసుకెళ్లి మహాకూ ఇస్తుంది. మహా నేను మాట్లాడలేను అని అంటుంది కానీ హారిక మాత్రం ఫోన్ అక్కడ వదిలేసి వెళ్లడంతో మహా నిద్రపోయి లేచినట్లు నటిస్తూ మాట్లాడుతుంది.. నేను నిద్రపోతున్నాను అందుకే చూసుకోలేదు అని భూషణ్తో ఎంత చెప్పినా సరే నాతో మాట్లాడాలి అని టార్చర్ చేస్తాడు.. కానీ మహా మాత్రం నేను వీడితో మాట్లాడను అని పడుకుంటుంది. ఉదయం లేవగానే మహాకూ వాళ్ళ నాన్న పెళ్లికి అందరిని పిలవడం చూసి చిరాకు పడుతుంది..

ఉదయం ఫోన్ చూడగానే భూషణ్ దాదాపు 200కు పైగా కాల్స్ చేశాడు.. అది చూసి మహా షాక్ అవుతుంది.. ఇక హారిక వచ్చి రెడీ అవ్వు లేచి అని అడుగుతుంది.. తన ఫోన్ ని చూడగానే 130 కాల్స్ భూషణ్ నుంచి వచ్చాయి అని అంటుంది. నీకు అన్ని నీకన్నా ఎక్కువ నాకు 200కు పైగా ఫోన్లు వచ్చాయి చూడు అని మహా అంటుంది.. నువ్వు చెప్పింది నిజమే.. ఎదో అనుకున్నా ఇంత శాడిస్ట్ ఏంటి ఇలా చేస్తున్నాడు అని హారిక కూడా షాక్ అవుతుంది.. నిద్ర వస్తుందని పడుకుంటే ఎన్నిసార్లు ఫోన్ చేయాలా అని హారిక అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన లలిత నేను రెడీ చేసే తీసుకు రమ్మంటే నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ అని హారిక పై సీరియస్ అవుతుంది.

Advertisement

Also Read : ప్రేమను క్షమించిన రామరాజు.. మళ్లీ ఫిట్టింగ్ పెట్టిన శ్రీవల్లి.. ప్రేమ కు షాకిచ్చిన ధీరజ్..

నేను చెప్పాను కదా వదినా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మా వాళ్ళు ఏమనుకుంటారు అని చూసావా.. మా అమ్మ అల్లుడికి నేనంటే ఎంత ప్రేమ అని మురిసిపోతుంది అని మహా అంటుంది.. మేమిద్దరం ఏం చేయాలో అర్థం కాక రెండు స్తంభాలాగా నిలబడిన వచ్చింది మూడో స్తంభం అని మహా లలితను అంటుంది. నీకోసం అల్లుడుగారు వస్తున్నారట నువ్వు వెళ్లి రెడీ ఇవ్వు అనేసి లలిత అంటుంది.. అప్పుడే కిందికి వచ్చిన భూషణ్ కి కాఫీ తెచ్చి ఇవ్వగానే నాకు వద్దు మీ అమ్మాయి కి కొంచెం కూడా భయం లేకుండా మాట్లాడుతుంది నేను ఒకసారి మీ అమ్మాయి తో మాట్లాడాలి అని బెడ్ రూమ్ కి వెళ్ళిపోతాడు. మహతో మాట్లాడుతుంటే మహా మాత్రం భూషణ్ పై సీరియస్ అయ్యి నువ్వు ఇక నుంచి వెళ్ళు నాపై నీ అధికారం ఏంటి అని అంటుంది.. ఆ మాట వినగానే భూషణ్ షాక్ అయిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×