E-Paper
Advertisement

Under 1 lakh Electric Scooters: ఓలా To హీరో.. లక్షలోపు సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Under 1 lakh Electric Scooters: ఓలా To హీరో.. లక్షలోపు సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

Under 1 lakh Electric Scooters 2026: రోజు రోజుకు పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. చాలా మంది పెట్రో వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తక్కువ ధరలో, మంచి రేంజ్ ఇచ్చే స్కూటర్లను పరిచయం చేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ లో రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవి? వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయి? అనే వివరాలు చూద్దాం..

రూ. 1 లక్షలోపు టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ప్రస్తుతం దేశీ మార్కెట్ లో రూ. 1 లక్షలోపు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాటి రేంజ్,కీ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

⦿ Ola S1 X (బేస్ వేరియంట్)

Advertisement

దీని ధర రూ. 74,999 – రూ.84,999 ఉంటుంది. వేరియంట్ ఆధారంగా ఫుల్ ఛార్జ్ మీద 95-151కిలో మీటర్ల రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 90 కిలో మీటర్లు ఉంటుంది. 2/3/4 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. టచ్‌ స్క్రీన్, యాప్ కనెక్టివిటీ, రిజెన్ బ్రేకింగ్, మల్టిపుల్ మోడ్స్ లాంటి ఫీచర్లు ఉంటాయి.

⦿ Hero Electric Optima

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 83,300 – రూ. 95,000 ఉంటుంది. ఒక్క ఛార్జ్ పై  89-135 కిలో మీటర్ల రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ 55 నుంచి 65 కిలో మీటర్లు ఉంటుంది. లీడ్ యాసిడ్, లిథియం బ్యాటరీ, డిజిటల్ డిస్‌ ప్లే, USB ఛార్జింగ్, కంబైన్డ్ బ్రేకింగ్ లాంటి ఫీచర్లు ఉంటాయి.

⦿ Ampere Magnus

Advertisement

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.  89,999 – రూ. 99,999 ఉంటుంది. వేరియంట్ ఆధారంగా రేంజ్ 80-100 కిలో మీటర్లు ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 63 కిలో మీటర్లు ఇస్తుంది. లిథియం ఐయాన్ బ్యాటరీ, రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్, డిజిటల్ క్లస్టర్, రివర్స్ మోడ్ లాంటి ఫీచర్లు ఉంటాయి.

⦿ Bajaj Chetak 2901 (బడ్జెట్ వేరియంట్)

ఈ స్కూటర్ ధర రూ. 95,998 – రూ. 99,998 ఉంటుంది. ఒక్క ఛార్జ్ పై 123 km మైలేజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 63 కిలో మీటర్లు ఇస్తుంది. మెటల్ బాడీ, డిజిటల్ కన్సోల్, రిజెన్ బ్రేకింగ్, IP67 బ్యాటరీ ఉంటుంది.

⦿ Hero Vida VX2

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 74,000 – రూ. 85,000 ఉంటుంది. ఒక్క ఛార్జ్ పై 90-100 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 65 కిలో మీటర్లు ఉంటుంది. రిమూవబుల్ బ్యాటరీ అవకాశం ఉంటుంది. TFT డిస్‌ ప్లే, కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉంటాయి.

ప్రస్తుతం రూ. 1 లక్షలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో  Ola S1 X మంచి రేంజ్, టచ్‌ స్క్రీన్, నావిగేషన్ లాంటి లేటెస్ట్ ఫీచర్లతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. రిలయబిలిటీ విషయానికి వస్తే, Bajaj Chetak, Ampere Magnus మంచి సర్వీస్ నెట్‌ వర్క్, బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంటాయి. పెట్రోల్ స్కూటర్‌తో పోలిస్తే రన్నింగ్ కాస్ట్  ప్రతి కిమీ 20 పైసల నుంచి 50 పైసల వరకు ఖర్చు అవుతుంది.

Read Also: సరికొత్త లుక్ లో సుజుకి యాక్సెస్, స్పోర్టీ డిజైన్ భలే ఉందిగా!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×