E-Paper
Advertisement

Actor Rajpal yadav: చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్ పాల్ కు ఉపశమనం..

Actor Rajpal yadav: చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్ పాల్ కు ఉపశమనం..
Advertisement

Actor Rajpal Yadav: బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు రాజ్ పాల్ యాదవ్ (Rajpal Yadav) ఇటీవల చెక్ బౌన్స్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే .ఈయన అరెస్టు కావడంతో ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈయన అరెస్టుపై స్పందిస్తూ ఆయనకు మద్దతుగా నిలబడమే కాకుండా చాలామంది ఆయనకు ఆర్థికంగా సహాయంగా కూడా నిలిచారు. చెక్ బౌన్స్ కేసులో భాగంగా ఢిల్లీలోని తీహాడ్ జైలు అధికారులు ముందు లొంగిపోయారు అయితే ఈయన అరెస్ట్ అయ్యే సమయంలో ఎంతో భావద్వేగానికి గురి అయిన విషయం తెలిసిందే. చెక్ బౌన్స్ కేసులో భాగంగా అరెస్ట్ కావడంతో ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నానని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఢిల్లీ హైకోర్టులో రాజ్ పాల్ యాదవ్ కు ఉపశమనం..

ఈ విధంగా రాజ్ పాల్ యాదవ్ జైలుకు వెళ్లే ముందు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈయనకు మద్దతుగా నిలిచారు. ఇక ఈ కేసు విషయంలో భాగంగా కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా ఈయన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఈయన గత నాలుగు రోజులుగా రిమాండ్ లోనే ఉన్నారు. ఇక సోమవారం రాజ్ పాల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. సోమవారం జరిగిన ఈ విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఈయనకు ఉపశమనం కల్పించింది.

షరతులతో కూడిన బెయిల్..

Advertisement

బెయిల్ పిటిషన్ విచారించిన ఢిల్లీ హైకోర్టు రాజ్ పాల్ యాదవ్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ కేసు విచారణకు ఈయన హాజరు కాకపోవడంతో ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే ఈయన లొంగిపోవడంతో కోర్ట్ ఈయనకు ఉపశమనం లభించింది అయితే కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటం విశేషం. ఈ షరతులకు కట్టుబడి ఉండాలని హై కోర్టు సూచనలు చేసింది. ఇలా ఈయనకు బెయిల్ రావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

Advertisement

ఇక రాజ్ పాల్ యాదవ్ 2010వ సంవత్సరంలో అతా పతా లాపత అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమా నిర్మాణం కోసం ఈయన ఢిల్లీకి చెందిన మురళి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఐదు కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి పూర్తిగా డిజాస్టర్ కావడంతో భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. అయితే ఈ సినిమా కోసం చేసిన అప్పును తీర్చడం కోసం ఈయన ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ అవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే 2018 వ సంవత్సరంలో రాజ్ పాల్ ఆరు నెలలపాటు జైలుకు వెళ్లి వచ్చారు. అయితే ఈయన చేసిన ఐదు కోట్ల రూపాయల అప్పు వడ్డీతో సహా ఇప్పుడు 9 కోట్లకు చేరుకుంది. ఈ కేసులో భాగంగానే ఈయన మరోసారి అరెస్టు అయ్యారు. ఇక రాజ్ పాల్ యాదవ్ రవితేజ హీరోగా నటించిన కిక్ 2 సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Also Read: Ritu chowdary: శివరాత్రి స్పెషల్.. షాకింగ్ లుక్ లో రీతూ..ఇది అస్సలు ఊహించలేదుగా!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×