E-Paper
Advertisement

Kova Bun: కోవా బన్ ఎక్కడ బాగా ఫేమస్? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి?

Kova Bun: కోవా బన్ ఎక్కడ బాగా ఫేమస్? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి?
Advertisement

Kova Bun: తెలంగాణలో ‘కోవా బన్’ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కరీంనగర్. అసలు కరీంనగర్ వెళ్లి కోవా బన్ తినకుండా వస్తే ఆ ట్రిప్ పూర్తి కానట్టే లెక్క. అక్కడి బేకరీల ముందు సాయంత్రం పూట ఉండే రద్దీ చూస్తేనే అర్థమవుతుంది ఈ స్వీట్ బన్‌కు ఉన్న క్రేజ్ ఏంటో. మరి అంత ఫేమస్ అయిన ఈ కోవా బన్‌ను ఇంట్లోనే బేకరీ స్టైల్‌లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా.

అసలైన కోవా తయారీ ఇలా..

కోవా బన్ రుచి అంతా అందులో పెట్టే కోవాలోనే ఉంటుంది. దీని కోసం ఒక లీటర్ పాలను వెడల్పాటి గిన్నెలో పోసి మరిగించాలి. మంట తగ్గించి, పాలు అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఓ 40 నిమిషాల పాటు ఓపిగ్గా చేస్తే, పాలలోని నీరంతా ఆవిరైపోయి చిక్కటి ముద్దలా తయారవుతుంది. ఇదే మనకు కావాల్సిన స్వచ్ఛమైన కోవా. లీటర్ పాలకు సుమారుగా ఓ పావు కిలో కోవా వస్తుంది.

Advertisement

Also Read: ముక్కంటికి నైవేద్యంగా పైనాపిల్ కేసరి.. 10 నిమిషాల్లో అద్భుతమైన రుచి!

బేకరీ స్టైల్ కోవా రహస్యం..

మనం తయారు చేసుకున్న కోవాను నేరుగా బన్‌లో పెట్టేయకూడదు. దానికి బేకరీ స్టైల్ టచ్ ఇవ్వాలి. ఒక పాన్‌లో కొంచెం నెయ్యి వేసి, ఈ కోవాను వేయించాలి. అది లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక.. అందులో తగినంత చక్కెర పొడి, కొంచెం ఏలకుల పొడి కలపాలి. ఇక్కడే అసలు సీక్రెట్ దాగుంది. అదేంటంటే.. రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ కలపడం. దీనివల్ల కోవాకు మంచి టెక్స్చర్ వస్తుంది. ఈ మిశ్రమం మరీ డ్రైగా అయిపోకముందే స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి.

ఇంట్లోనే కరీంనగర్ కోవా బన్ రుచి:

Advertisement

బేకరీల్లో ఈ స్వీట్ బన్లను విడిగా కూడా అమ్ముతుంటారు. ఈ బన్‌ను మధ్యలోకి కట్ చేసి, మనం రెడీ చేసుకున్న కోవా మిశ్రమాన్ని అందులో నింపాలి. అయితే పాలను సరిగ్గా మరిగించి, చక్కెర పాళ్లను జాగ్రత్తగా కలిపితే కరీంనగర్ వెళ్లకుండానే ఆ ఫేమస్ కోవా బన్ రుచిని మన ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. పిల్లలకైతే ఇది బెస్ట్ ఈవెనింగ్ స్నాక్ అవుతుంది. దశాబ్దాలు గడుస్తున్నా ఈ సంప్రదాయ బేకరీ స్వీట్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడానికి కారణం ఆ నోరూరించే తీపి కోవాయే మరి.

Also Read: అర్ధనారీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ‘ఆమ్రఖండ్‌’ను ఇలా తయారు చేసుకోండి!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×