Amardeep Chowdary: అమర్ దీప్ చౌదరి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం హీరోగా మారి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. బుల్లితెర సీరియల్స్ ద్వారా సక్సెస్ అందుకున్న అమర్ అనంతరం బిగ్ బాస్ 7(Bigg Boss 7) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనడమే కాకుండా రన్నర్ గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ తర్వాత అమర్ దీప్(Amar Deep) బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉంటున్నారు కేవలం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే అమర్ హీరోగా నటించిన సుమతీ శతకం (Sumathi Sathakam)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
సుమతి శతకం సినిమా ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ పాటలు ట్రైలర్ కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమా విడుదలకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అమర్ కూడా వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే అమర్ సుమతి శతకం సినిమాకు ఊహించని స్థాయిలో మద్దతు లభించింది.
అమర్ ఎంతగానో ఆరాధించే నటుడు రవితేజ(Raviteja) నుంచి ఆయన సినిమాకు మద్దతు లభించడంతో అమర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవితేజకు అమర్ వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే .ఎన్నో సందర్భాలలో రవితేజ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ తనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. రవితేజ సినిమాలో ఛాన్స్ ఇస్తాము బిగ్ బాస్ నుంచి బయటకు వస్తావా అంటే క్షణం కూడా ఆలోచించకుండా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఇలా రవితేజ అంటే చచ్చేంత అభిమానం ఉన్న అమర్ సినిమాకు ఏకంగా రవితేజ మద్దతుగా నిలబడి సినిమాని ప్రమోట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#Raviteja Garu wishes to #Amardeep for #SumathiSathakamOnFeb6 pic.twitter.com/vPAn8IgYai
— Rajesh Manne (@rajeshmanne1) February 3, 2026
ఇక రవితేజ ఒక వీడియోని షేర్ చేస్తూ అమర్ దీప్ చౌదరి నటించిన సుమతి శతకం సినిమా ట్రైలర్ ,టీజర్ చూశాను చాలా అద్భుతంగా ఉన్నాయి విష్ యు ఆల్ ద బెస్ట్ ఫర్ సుమతి శతకం. గుడ్ లక్ ,టేక్ కేర్ అంటూ రవితేజ ఒక స్పెషల్ వీడియోని విడుదల చేయడంతో అమర్ దీప్, రవితేజ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సుమతి శతకం సినిమా విషయానికి వస్తే ఈ సినిమా గ్రామీణ కుటుంబ ప్రేమ కథ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు ఎం ఎం నాయుడు దర్శకత్వం వహించగా అమర్ జోడిగా శైలి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్ సారధ్యంలో విడుదల కానుంది. మరి హీరోగా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైన అమర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది.
Also Read: Jr NTR: ఎన్టీఆర్ పై పూజా బేడి కామెంట్స్.. మహిళల విషయంలో తారక్ అలాంటి నిర్ణయం తీసుకున్నారా?