Minister Komatireddy: స్వేఛ్చ బ్యూరో: మూడు దశాబ్దాల క్రితం సామాన్య రైతు బిడ్డగా మీ ముందుకు వస్తే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు, ఎంపీ ని చేసిండ్రు, సీనియర్ మంత్రిగా గుర్తింపునిచ్చారు. నల్గొండ ప్రజల రుణం తీర్చుకోలేనిదని రాష్ట్ర ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం 14,15 మర్రిగూడ, చర్లపల్లి డివిజన్ల అభ్యర్థులకు మద్దతుగా చర్లపల్లి బొడ్రాయి చౌరస్త నుంచి ప్రచారం ప్రారంభించారు. 12వ డివిజన్ అభ్యర్థి మామిడి కార్తీక్, 27,28,29,26,30 డివిజన్లకు చెందిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్డు షో తో పాటు ఆయా కాలనీలలో ఓటర్లను అభ్యర్థించారు.
ప్రచారంలో భాగంగా చిన్నారులను ఎత్తుకోవటంతో పాటు పలువురు బాలికలతో ముచ్చటించారు. ఆయా డివిజన్లకు ప్రచారం నిమిత్తం వెళ్లిన మంత్రికి ఆ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నల్గొండ కార్పొరేషన్ పై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలన్నారు. 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పటికే సుమారు రూ. 2 వేల కోట్లతో నల్గొండ అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనంతరం నల్గొండ కార్పొరేషన్ డెవలప్ మెంట్ లో ముందుండే విధంగా ప్రణాళిక ప్రకారం పనులు చేస్తున్నట్లు చెప్పారు.
Also Read: Idiot Movie: ఇడియట్ సినిమా ఇసుక సీన్ గుర్తుందా..ఈ సీన్ కు ఇన్ని అవార్డులు వచ్చాయా?
48 డివిజన్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మీ నాయకుల ద్వారా మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. నల్గొండ స్పార్ట్ సిటీగా తీర్చిదిద్దనున్నమన్నారు. బొట్టు కూడా ప్రభుత్వ పాఠశాల తరహాలోనే నల్గొండ జిల్లా కేంద్రంలోని మిగిలిన ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా ఉద్వేగ భరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో అభ్యర్థులతో పాటు లోకల్ లీడర్స్ ఉన్నారు.
Also Read: Idiot Movie: ఇడియట్ సినిమా ఇసుక సీన్ గుర్తుందా..ఈ సీన్ కు ఇన్ని అవార్డులు వచ్చాయా?