E-Paper
Advertisement

NTRNeel: రాసి పెట్టుకోండి.. 2 వేల కోట్లు! ఈ మాట అన్నది ఎవరో తెలుసా?

NTRNeel: రాసి పెట్టుకోండి.. 2 వేల కోట్లు! ఈ మాట అన్నది ఎవరో తెలుసా?
Advertisement

NTRNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man of Masses NTR), మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ అయిన ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (NTRNeel Movie). ఈ చిత్రానికి టైటిల్‌గా ‘డ్రాగన్’ అని అనుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమాకు ‘బ్రూస్‌లీ’ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. మధ్యలో ఈ సినిమా ఆగిపోయిందని.. దర్శకుడికి, హీరోకి మధ్య విభేదాలు వచ్చాయనేలా కూడా వార్తలు నడిచాయి. అన్నీ సర్దుకుని ఇటీవలే మళ్లీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు కానీ, ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా మేకర్స్ ఇవ్వడం లేదు. కానీ, సినిమా ఎప్పుడు వచ్చినా, రికార్డులు బద్దలవడం ఖాయం అనే ఫీల్‌ని మాత్రం అభిమానులకు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ నటుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Also Read- Bandla Ganesh: చంద్రబాబు, రేవంత్, పవన్.. బండ్లకు ఎవరి పేరు వింటే ఊపొస్తుందో తెలుసా?

2 వేల కోట్లు తీసుకొస్తున్నాడు

Advertisement

యంగ్ యాక్టర్ శివ కుమార్ (Siva Kumar) ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయన ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. ఆయన ఈ సినిమా ఎలా వస్తుందనే విషయాన్ని తాజాగా టాలీవుడ్‌లో జరిగిన ఓ మూవీ వేడుకలో చెప్పాడు. అంతే, ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. అసలింతకీ ఆ శివ కుమార్ ఏం చెప్పాడని అనుకుంటున్నారా? ‘‘నా పేరు శివ కుమార్.. ఎన్టీఆర్‌నీల్ మూవీ అవుట్ డోర్ షూటింగ్ నుంచి వచ్చి ఫైవ్ డేస్ అవుతుంది. మిగతావన్నీ పక్కన పెడితే ఈ సంవత్సరం తారక్ అన్న 2 వేల కోట్లు తీసుకొస్తాడు. పక్కాగా 2 వేల కోట్లు అంతే.. రాసి పెట్టుకోండి.. అన్న నడుము ఇంతే అయినా.. ఆయన వాక్, రేబాన్ డిజర్ట్‌లో మెరిసిపోవడం.. అంతే.. ఇంతకు మించి నేనేమీ చెప్పను. రెండు వేల కోట్లు మాత్రం పక్కా. నేను చెబుతున్నాను రాసి పెట్టుకోండి’’ అంటూ ఆయన మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read- Heroines: అసభ్యకర రీతిలో, జూమ్ చేసి మరీ మా శరీరాలను చూపించాల్సిన అవసరమేంటి?

ఇక రండిరా ఎవరు వస్తారో?

Advertisement

శివ కుమార్ చెబుతున్న ఈ వీడియోను నందమూరి అభిమానులు షేర్ చేస్తూ.. ‘ఇక రండిరా ఎవరు వస్తారో?’ అనేలా కామెంట్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎక్కడో డీలా పడిన ఫ్యాన్స్‌కి శివ కుమార్ మాంచి బూస్ట్ ఇచ్చాడు. ఆయన ఇంతలా చెబుతున్నాడంటే, సినిమాలో మాములు విషయం లేదనేలా, ఫ్యాన్స్ డిస్కషన్స్ కూడా మొదలు పెట్టారు. మా అన్నకి ఒక మాంచి మాస్ యాక్షన్ సబ్జెక్ట్ పడితే.. ఎలా ఉంటుందో చూస్తారంటూ ఫ్యాన్స్ కాలర్స్ ఎగరేస్తున్నారంటే నమ్మాలి మరి. ఎందుకంటే, ఎప్పుడు అప్డేట్ వస్తుందో కూడా తెలియని సినిమా గురించి, ఈ ఒక్క మాట చాలు అనేంత ట్రీట్‌ని శివ కుమార్ మాటలు వాళ్లకి ఇచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ రావడంతో, ఆకలి మీద ఉన్న అభిమానులు.. దీనినే మహా ప్రసాదం అని ఆరగిస్తున్నారు.

Also Read- Actor Sivaji: కోకాపేట‌లో 18 ఎక‌రాలు… రియల్ ఎస్టేట్ లో భారీగా ఆస్తులు పోగు చేసిన శివాజీ!

Related News

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

Big Stories

Advertisement
×