E-Paper
Advertisement

Heroines: అసభ్యకర రీతిలో, జూమ్ చేసి మరీ మా శరీరాలను చూపించాల్సిన అవసరమేంటి?

Heroines: అసభ్యకర రీతిలో, జూమ్ చేసి మరీ మా శరీరాలను చూపించాల్సిన అవసరమేంటి?
Advertisement

Heroines: ఒకవైపు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తుంటే.. మరోవైపు నటీమణులు సోషల్ మీడియా వేదికగా మరో వార్‌కు తెరలేపారు. ఇది అలాంటిలాంటి వార్ కాదు. అందులో యంగ్ హీరోయిన్లు ఇలాంటి వార్‌ను ప్రకటిస్తారని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన అందాల భామలు (Kannada Heroines) రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), సప్తమీ గౌడ (Sapthami Gowda), ఆషిక రంగనాథ్ (Ashika Ranganath).. సోషల్ మీడియా వేదికగా వార్ ప్రకటించారు. సినిమాలలో వారు ఎంత స్పైసీగా కనిపించినా, ఎంత ఎక్స్‌పోజ్ చేసినా ఓకే కానీ, వారు హాజరయ్యే పబ్లిక్ ఈవెంట్స్‌లో మాత్రం ఎలా పడితే అలా ఫొటోలు, వీడియోలు తీయకూడదట? ఇదే వారు లేవనెత్తిన ప్రధానాంశం. వాస్తవానికి వారు చేస్తున్న ఈ పోరాటం అనుచితమైనదే అని చెప్పుకోవాలి. ఇటీవల శివాజీ దీని గురించే కదా మాట్లాడింది. ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్‌కు చక్కగా చీర కట్టుకుని వస్తే ఏ బాధ ఉండదు, అంతా గౌరవంగా చూస్తారని చెబితే, అందరూ కాదు కానీ.. కొంత మంది తప్పుపట్టారు. ఇప్పుడు ఏకంగా మమ్మల్ని ఇబ్బందిగా చూపిస్తున్నారంటూ వాళ్లే.. యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. అసలింతకీ ఈ భామల యుద్ధం దేనికంటే..

Also Read- Allu Sirish Nainika wedding: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ .. కనిపించని ముగ్గురు స్టార్స్… ఏం జరిగిందబ్బా?

జూమ్ చేసి చూపించాల్సిన అవసరమేంటి?

Advertisement

‘‘సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలుగా మాకు ఎదురవుతున్న ఒక రిపీటెడ్ సమస్యను పరిష్కరించడానికి మేమంతా ఏకమయ్యాము. మేమంతా పలు పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొన్నప్పుడు మా వీడియోలు, ఫోటోలను తరచుగా అసభ్యకరమైన విధంగా చిత్రీకరించడం, మా పని కంటే మా శరీర భాగాలపైనే అనవసరంగా జూమ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసి, వైరల్ చేయడం జరుగుతోంది. కొందరు వ్యక్తులు చేస్తున్న ఇటువంటి పనులు గౌరవప్రదమైనవి కావు, అసలు ఆమోదయోగ్యం కానే కావు. మేము ఇక్కడ ఉన్నది మా కళ కోసం, ముఖ్యంగా సినిమా కోసం. ఉద్దేశపూర్వకంగా చేసే ఇటువంటి జూమ్-ఇన్‌లను, అసభ్యకరమైన యాంగిల్స్‌ను మేము ఖండిస్తున్నాము. ఇవి వ్యక్తిగత గౌరవాన్ని ఉల్లంఘించడమే. ఇలాంటి ప్రవర్తనను మేము ఎంతమాత్రం సహించం, దీనిని సాధారణ విషయంగా చూడలేము. సినిమా వేడుకలను కవర్ చేసే వారు వృత్తిపరమైన బాధ్యతతో, కనీస గౌరవం, మర్యాదలతో వ్యవహరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ విషయంలో మేమంతా ఒకే మాటపై ఉన్నాము. ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న ప్రతి మహిళకు మేము అండగా ఉంటాం. మాకు దక్కాల్సిన గౌరవం కోసం మేమంతా ఒకరికొకరు మద్దతుగా నిలుస్తాం’’ అని సోషల్ మీడియా వేదికగా రుక్మిణీ వసంత్, సప్తమీ గౌడ, ఆషిక రంగనాథ్ చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

Rukmini Vasanth Insta Post
kannada heroines protest against objectionable zoom videos

Also Read- Buchi Babu Sana: ‘రై రై రా రా’ పాట చేస్తున్నప్పుడు చరణ్‌కు ‘హై ఫీవర్’.. అయినా సరే!

వారి గురించి కూడా మాట్లాడాల్సింది

Advertisement

పబ్లిక్ ఈవెంట్స్‌కు పద్దతిగా వస్తే.. ఎవరూ పట్టించుకోరని, కావాలని సగం సగం డ్రస్‌లు వేసుకుని వచ్చే వారి గురించి కూడా వాళ్లు మాట్లాడితే బాగుంటుంది. అందంగా కనిపించాలని అంతా అనుకుంటారు. కానీ శరీర భాగాలు కనిపించాలని చూసే, ప్లాన్ చేసే హీరోయిన్లు ఉన్నంతకాలం.. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి.. ముందు మీ నుంచే జాగ్రత్త పడటం మంచిదని, ఈ పోస్ట్‌లకు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో సమాజం ఉందో గమనించి, మసులుకుంటే మంచిదని వారు హితబోధ చేస్తున్నారు. చూద్దాం మరి.. ఈ వార్ ఎంత వరకు వెళుతుందో?

Also Read- Sree Vishnu: చేతులు కాల్చుకుంటున్న శ్రీ విష్ణు.. ఇప్పటికైనా ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×